English   

నోటా ట్రైల‌ర్.. సిఎం విజ‌య్ పిచ్చెక్కించాడు.. 

NOTA-Trailer
2018-09-06 16:36:32

తెలుగులో సంచ‌ల‌నాలు సృష్టిస్తూ దూసుకుపోతున్న విజయ్ దేవ‌ర‌కొండ ఇప్పుడు త‌మిళ‌నాట కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అక్క‌డ ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న నోటా సినిమాతో కోలీవుడ్ కు వెళ్తున్నాడు. సూర్య త‌నే స్వయంగా విజ‌య్ కు స్వాగ‌తం ప‌లికాడు. తాజాగా ఈయ‌న న‌టిస్తున్న నోటా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమా రేంజ్ ఏంటో అర్థ‌మైపోతుంది. ఏదో అల్లాట‌ప్పాగా కాదు.. ప‌క్కా ప్లానింగ్ తోనే త‌మిళ ఇండ‌స్ట్రీకి పయ‌నం అయ్యాడు విజ‌య్.

ఈ ట్రైల‌ర్ చూస్తుంటేనే సీన్ తెలుస్తుంది. ముఖ్యంగా విజ‌య్ మ‌రోసారి రెచ్చిపోయాడు. బూతులు కూడా అప్పుడప్పుడూ వాడేయ‌డంతో పాటు ముద్దుల వ‌ర్షం కూడా కురిపించాడు. మొన్న‌టికి మొన్న భ‌ర‌త్ అనే నేనులో సిఎంగా న‌టించాడు మ‌హేశ్. అది మ‌రిచిపోక‌ముందే ఇప్పుడు మ‌రోసారి ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న కూడా ఈ పాత్ర‌లో రెచ్చిపోయాడు. త‌న ఆటిట్యూడ్ జోడించి ర‌ప్ఫాడించాడు ఈ కుర్ర హీరో. ముఖ్యంగా ఈ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు మ‌రో స్థాయిలో పెరిగాయి. ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న విడుద‌ల కానుంది. మెహ్రీన్ హీరోయిన్ గా న‌టిస్తుంది. 

More Related Stories