English   

తప్పు చేస్తున్నావ్ సమంత

Samantha Akkineni Neglecting Media Not Giving Interviews for U Turn
2018-09-06 18:57:40

సినిమా వాళ్లు.. మీడియా.. ఇద్ద‌రూ భార్యాభ‌ర్త‌ల్లా ఉండాలి. ఏ ఒక్క‌రికి కోపం వ‌చ్చినా కూడా సినిమా అనే కాపురం పోతుంది. ఈ విష‌యం తెలిసే చాలా మంది ఇండ‌స్ట్రీ పెద్ద‌లు కూడా మీడియా ముందు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. కానీ ఇప్పుడు స‌మంత మాత్రం నోరు జారింది. అస‌లు మీడియా అంటే ఏంటంట‌ పెద్ద గొప్ప అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించింది. ఈమె తీరుపై ఇప్పుడు ప‌లు మీడియా సంస్థ‌లు గుర్రుగా ఉన్నాయి. తెలుగుతో పాటు త‌మిళ నాట కూడా మీడియాల‌కు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌కుండా ఏడిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. యు ట‌ర్న్ సినిమా ప్ర‌మోష‌న్ కోసం ప్ర‌తీ ఛానల్ కు ఒక ఇంట‌ర్వ్యూ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకుంది స్యామ్. కానీ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ ఒక్క ఛానెల్ కు మాత్ర‌మే పూర్తి ఇంట‌ర్వ్యూ ఇచ్చి.. మిగిలిన వాళ్ల‌ను చుట్టేసింది.

అడిగితే నా యిష్టం అన్న‌ట్లుగా లేచి వెళ్లిపోయింద‌ని తెలుస్తుంది. మీడియా ప్ర‌తినిథులు కూడా స‌మంతపై చాలా గుర్రుగా ఉన్నారు. పేరున్న పెద్ద ఛానెల్స్ కు కూడా 5-10 నిమిషాల ఇంట‌ర్వ్యూలు ఇచ్చింది స‌మంత. త‌మిళ‌నాట అయితే కేవ‌లం 4 ఇంట‌ర్వ్యూలు మాత్ర‌మే ఇవ్వ‌డంతో వాటిని ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నారు కొంద‌రు. మొత్తానికి ఒక‌ప్పుడు మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండే స్యామ్ ఇప్పుడు ఇలా మారిపోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే. అస‌లు ఆమె బుర్ర‌లో ఏముందో తెలియ‌దు కానీ ఇలా చేయ‌డం వ‌ల్ల అన‌వ‌స‌రంగా యు ట‌ర్న్ సినిమాకు మైన‌స్ అవుతుంది. ఎవ‌రెన్ని మాట్లాడినా అల్టిమేట్ గా మ‌ళ్లీ మీడియాలోనే ఆ సినిమా ప్ర‌మోష‌న్ చేసుకోవాలి క‌దా. మ‌రప్పుడు ఈ భామ ఏం చేస్తుందో..?

More Related Stories