English   

స్టార్స్ వల్ల కాలేదు.. విజయ్ దేవరకొండ చేసాడు

Vijay Devarakonda Creates Latest Record Even Star Heroes Also Can't Did
2018-09-06 20:30:57

అసాధ్యం అనేది ఉండ‌దు. ప్ర‌య‌త్నిస్తే ఏదైనా సాధ్య‌మే. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఈయ‌న గీతగోవిందం సినిమాతో ఎన్ని రికార్డులు తిర‌గ‌రాయాలో అన్నీ రాస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవికి కూడా సాధ్యం కాని రికార్డును తాను అందుకున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రం 120 కోట్ల గ్రాస్ వైపు ప‌రుగులు తీస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఖాతాలో మ‌రో రికార్డ్ చేరిపోయింది. త‌మిళ‌నాడులో ఈ సినిమా ఏకంగా 5.89 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. బాహుబ‌లి కాకుండా అంత వ‌సూలు చేసిన సినిమా మ‌రేది లేదు. మహేష్ స్పైడ‌ర్ అక్క‌డ నేరుగా విడుద‌లైనా కూడా అంత క‌లెక్ట్ చేయ‌లేదు. కానీ ఇప్పుడు తెలుగు వ‌ర్ష‌న్ చెన్నైలో ఏకంగా 6 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయ‌డం అనేది చిన్న విష‌యం కాదు.

ఇప్పుడు త‌మిళ‌నాట విజ‌య్ సూప‌ర్ స్టార్. అందుకే ఈయ‌న న‌టిస్తున్న నోటా సినిమాపై అంత‌గా అక్క‌డ అంచ‌నాలున్నాయి. మ‌న ద‌గ్గ‌ర సూప‌ర్ స్టార్స్ కు కూడా సాధ్యం కాని చాలా రికార్డుల‌ను త‌క్కువ టైమ్ లోనే అందుకున్నాడు విజ‌య్. త‌మిళ‌నాట అయితే ఇది అరాచ‌క‌మే. ఓవ‌ర్సీస్ లో కూడా ఈ చిత్రం 2.39 మిలియ‌న్ వ‌సూలు చేసింది. అక్క‌డ కూడా విజ‌య్ సంచ‌ల‌నాలే క‌నిపిస్తున్నాయి. గీత‌గోవిందం విజ‌యం త‌ర్వాత విజ‌య్ పై ఇంకా బాధ్య‌త పెరిగింది. అందుకే క‌థ‌ల విష‌యంలో ఇంకాస్త కేర్ తీసుకుంటున్నాడు. ఇమేజ్ తెచ్చుకోవ‌డం చాలా క‌ష్టం.. దాన్ని పోగొట్టుకోవ‌డం ఈజీ. మొద‌టిది ఇప్ప‌టికే చేసాడు విజ‌య్.. రెండోది చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. ఈయ‌న ప్ర‌స్తుతం నోటాతో పాటు ట్యాక్సీవాలా.. డియ‌ర్ కామ్రేడ్ సినిమాల్లో న‌టిస్తున్నాడు.

More Related Stories