English   

వార‌సుడి ఎంట్రీ ఎప్పుడో..?

Nandamuri Fans Are Waiting for Balakrishna's Son Mokshagna Debut
2018-09-07 00:10:58

ఇప్ప‌ట్లో వార‌సులు ఎవ‌రూ ఇండ‌స్ట్రీకి రాకపోవ‌చ్చు.. ఒక్క నంద‌మూరి మోక్ష‌జ్ఞ త‌ప్ప‌. ఈయ‌న ఎంట్రీ కోసం నంద‌మూరి అభిమానులు కొన్నేళ్లుగా వేచి చూస్తున్నారు. జూనియ‌ర్ బాల‌య్య వ‌స్తాడు.. వ‌చ్చీ రాగానే బాక్సాఫీస్ తాట తీస్తాడు అనే ఊహ‌ల్లో ఉన్నారు అభిమానులు. పైగా నంద‌మూరి ఫ్యామిలీ అంటేనే మాస్.. వాళ్ల‌కు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ మ‌రెవ‌రికీ ఉండ‌దు. ఒక్క సినిమా హిట్టైతే చాలు ఆటోమేటిక్ గా స్టార్స్ అయిపోతారు. సింహాద్రి ఎఫెక్ట్ తో ఇప్ప‌టికీ సూప‌ర్ స్టార్ గానే ఉన్నాడు ఎన్టీఆర్.

ఇక బాల‌య్య సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్పుడో ఓ సారి హిట్ కొట్టినా..అది సాలిడ్ గా ఉంటుంది. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మ‌రో వార‌సుడు వ‌స్తున్నాడు. అత‌డే మోక్ష‌జ్ఞ‌. 12 ఏళ్ల తర్వాత నంద‌మూరి ఫ్యామిలీ నుంచి వ‌స్తోన్న వార‌సుడు మోక్షు. క‌ళ్యాణ్ రామ్ త‌ర్వాత మ‌ళ్లీ కొత్త హీరో ఎవ‌రూ రాలేదు. అఖిల్ 20 ఏళ్ల‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చేసాడు. చ‌ర‌ణ్ కూడా అప్ప‌ట్లో 22 ఏళ్ల‌కే హీరో అయ్యాడు.. బ‌న్నీ అయితే మ‌రీ 18 ఏళ్ల‌కే వ‌చ్చేసాడు.. నాగ‌చైత‌న్య 22 కు వ‌చ్చాడు. ఇప్పుడు మోక్ష‌జ్ఞ కూడా 20 ల్లోకి వ‌చ్చేసాడు. దాంతో త‌న‌యుడిని హీరో చేస్తున్నాడు బాల‌య్య‌. 2018 జూన్ త‌ర్వాత త‌న‌ వార‌సున్ని తెర‌పై తీసుకొస్తున్నాడు బాల‌య్య‌. కానీ దీనిపై క్లారిటీ రాలేదు.

ఇప్పుడు 2019కి ఇది పోస్ట్ పోన్ అయింది.  ఇప్పుడు ఈయ‌న ఎన్టీఆర్ బ‌యోపిక్ తో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర్వాత మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి ఆలోచించ‌నున్నాడు. అయితే సాయి కొర్ర‌పాటి మాత్రం మోక్షు కోసం ఇప్ప‌టికే రానే వ‌చ్చాడు రామ‌య్యా అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. తొలి సినిమా మాస్ ను మెప్పించేలా ఉంటుందా.. లేదంటే ల‌వ్ స్టోరీ చేస్తాడా అనే విష‌యంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం క్రిష్ చేతుల్లోనే త‌న వార‌సున్ని బాల‌య్య పెడుతున్నాడు అని తెలుస్తుంది.

ప్ర‌స్తుతం ఫిజిక్ మెయింట‌నెన్స్.. న‌ట‌న‌పై దృష్టి పెట్టాడు మోక్ష‌జ్ఞ. ఈ కుర్రాడి త‌ర్వాత.. మ‌రో కొత్త వార‌సుడు రావ‌డానికి త‌క్కువ‌లో త‌క్కువ ప‌దేళ్లు ప‌ట్ట‌డం ఖాయం. ప‌వ‌న్ కొడుకు అఖీరానంద‌న్, మ‌హేశ్ త‌న‌యుడు గౌత‌మ్, వెంక‌టేశ్ కొడుకు అర్జున్.. వీళ్లందరి వ‌య‌సు ఇప్పుడు 10-12 ఏళ్లే. వీళ్లంద‌రూ హీరోలవ్వాలంటే మ‌రో ప‌దేళ్లు గ్యారెంటీ. మ‌రి ఈ కొత్త నంద‌మూరి వార‌సుడు ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో చూడాలిక‌.

More Related Stories