English   

ఆమె సిగ్గు వదిలేసి ఓపెన్ అయింది

Hottest Actress Poonam Pandey Commented on Section 377 Free to Love All
2018-09-07 00:51:10

ఖచ్చితంగా ఇదే అనుకుంటున్నారు ఇప్పుడు ప్రేక్ష‌కులు కూడా. లేక‌పోతే మ‌రేంటి.. క‌నీసం మాట‌ల‌కు కూడా అంద‌ని రీతిలో ఈ భామ దూకుడు చూపిస్తుంది. గే క‌ల్చ‌ర్ ను ఆమోదిస్తూ సుప్రీమ్ కోర్ట్ సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వ‌చ్చిన త‌ర్వాత గేస్ అంతా క‌లిసి పార్టీ చేసుకున్నారు. అయితే వాళ్ల‌తో పాటు మ‌రో ముద్దుగుమ్మ కూడా పండ‌గ చేసుకుంది. గే పార్టీని చూపించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఎవ‌రో కాదు.. పూన‌మ్ పాండే. ఈ భామ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఈమె గురించి చెప్పాలంటే గూగుల్ కూడా వేడెక్కిపోతుంది. అంత‌గా ర‌చ్చ చేస్తుంది పూన‌మ్. ష‌ర‌మ్ అనే మాట అస్స‌లు ఈ భామ డిక్ష‌న‌రీలో ఉండ‌దు. ఇప్పుడు కూడా సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పును ప్ర‌శంసిస్తూ మాట‌ల్లో చెప్ప‌లేని ఓ ఫోటో పెట్టింది పూన‌మ్ పాండే. దానికి పెద్ద వ్యాసం కూడా రాసింది. ల‌వ్ అనేది అద్భుత‌మైన ఎమోష‌న్.. దాన్ని ఎలాగైనా మ‌నం చూపించొచ్చు.. ఆ హ‌క్కు అంద‌రికీ ఉంటుంది అని రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ‌.

అంతేకాదు.. సెక్ష‌న్ 377ను అంద‌రూ క‌లిసి ఆమోదించండి అంటూ ట్వీట్ చేసింది. గే క‌ల్చ‌ర్ ను ఆమోదించ‌డంతో ఇప్పుడు జెండ‌ర్ తో ప‌నిలేకుండా అంతా క‌లిసి ఎంజాయ్ చేయొచ్చ‌ని మ‌రీ జుగుప్సాక‌రంగా పోస్ట్ చేసింది పూన‌మ్ పాండే. ఇప్ప‌ట్నుంచి రంగు.. రుచి.. వ‌య‌సు.. కులం.. మ‌తం.. లింగం అనేది లేకుండా  అంతా క‌లిసి కట్టుగా ఎంజాయ్ చేయండంటూ సిగ్గు లేకుండా రాసుకొచ్చింది ఈ భామ‌. ఈ ట్వీట్ పై కొన్ని సంఘాలు అప్పుడే ర‌చ్చ మొద‌లుపెట్టాయి. అయినా పూన‌మ్ త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. అంతేలెండి.. అప్ప‌ట్లో ఈ భామ‌కు 24 గంట‌లు ఒక‌టే ధ్యాస‌. ఎలా అందాలు ఆర‌బోయాలి.. సోష‌ల్ మీడియాలో ఎలా వైర‌ల్ అవ్వాలి.. ఇదొక్కటే ధ్యాస‌తో జీవితం మొత్తం గ‌డిపేస్తుంది పూన‌మ్ పాండే. ఈ జాడ్యం ఇప్ప‌టిది కాదు.. అప్పుడెప్పుడో 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిస్తే స్టేడియంలో బ‌ట్ట‌లు విప్పి తిరుగుతా అంటూ ర‌చ్చ చేసింది పూన‌మ్. మాట నిల‌బెట్టుకోక‌పోయినా.. దాదాపు అంతే హాట్ గా ఫోటోషూట్లు మాత్రం చేస్తుంటుంది. మొత్తానికి ఏం చేసైనా సోష‌ల్ మీడియాలో త‌న పేరు ఉంటే చాల‌నుకుంటుంది పూన‌మ్.

 

More Related Stories