English   

సూర్య త‌ప్పుకున్నాడు.. ధ‌నుష్ ఇరుక్కున్నాడు

Dhanush in.. Suriya NGK Out From Diwali Race
2018-09-07 06:39:29

ఇప్పుడు త‌మిళ‌నాట న‌డుస్తున్న చ‌ర్చ అయితే ఇదే. చాలా తెలివిగా త‌ప్పించుకున్నాడో.. లేదంటే కావాలంటే త‌ప్పుకున్నాడో తెలియ‌దు కానీ దివాళి రేస్ నుంచి సూర్య త‌ప్పుకున్నాడు. ఈయ‌న న‌టిస్తున్న ఎన్జికే సినిమా అనుకున్న స‌మ‌యానికి పూర్తి కావ‌డం లేదు. సెల్వ రాఘ‌వ‌న్ ను న‌మ్ముకున్నందుకు ఈయ‌నకు తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. ఇదిలా ఉంటే సూర్య వ‌దిలేసిన స్థానంపై క‌న్నేసాడు ధ‌నుష్. ఇప్ప‌టికే దివాళికి నేనున్నా అంటూ ఖ‌ర్చీఫ్ వేసుకుని ఉన్నాడు విజ‌య్. మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తున్న స‌ర్కార్ దివాళి పండ‌క్కే రానుంది. అయితే అప్పుడు విజ‌య్ ఉన్నాడ‌ని తెలిసినా కూడా సూర్య కూడా రావాల‌నుకున్నాడు. ఎందుకంటే దివాళి పెద్ద పండ‌గ‌.. పైగా ఎన్ని సినిమాలు వ‌చ్చినా కూడా బాగుంటే ఆడ‌తాయ‌నే న‌మ్మ‌కం ఉంటుంది కాబ‌ట్టి. కానీ ప‌రిస్థితులు ప‌గ బ‌ట్ట‌డంతో సూర్య త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది.

ఇక ఇప్పుడు సూర్య వ‌దిలేసిన స్థానాన్ని ధ‌నుష్ తీసుకున్నాడు. గౌత‌మ్ మీన‌న్ తో ఈయ‌న చేస్తున్న ఎనాయ్ నోకి పాయుమ్ తోట సినిమా దివాళికి రానుంది. ఏడాది కిందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనుకోని కార‌ణాల‌తో వర‌స‌గా వాయిదా ప‌డుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని ఫిక్స్ అయ్యాడు గౌత‌మ్ మీన‌న్. ఇందులో నితిన్ బ్యూటీ మేఘాఆకాశ్ హీరోయిన్ గా న‌టించింది. ధ‌నుష్ కూడా ఈ సినిమాపై ఆశ‌లు వ‌దిలేసుకుని ఇత‌ర సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో పోయి పోయి విజ‌య్ స‌ర్కార్ పై పోటీకి వేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ధ‌నుష్ కూడా ఈ సినిమా హిట్ సంగ‌తి త‌ర్వాత ముందు విడుద‌లైతే చాలు అనుకుంటున్నాడు. అందుకే విజ‌య్ సినిమాపై అంచ‌నాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలిసినా కూడా ఏ భ‌యం లేకుండా వ‌స్తున్నాడు. త‌మిళ‌నాట దివాళికి ఈ పోరు ఆస‌క్తిక‌రంగా మారిందిప్పుడు.

More Related Stories