English   

విజయ్ దేవరకొండకు రుణపడిన అల్లు అరవింద్

Vijay Devarakonda's Geetha Govindam Brought more Profits to Allu Aravind
2018-09-07 07:35:28

అవును.. ఇప్పుడు నిజంగానే విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు రుణ‌ప‌డిపోయాడు అల్లు అర‌వింద్. ఈయ‌న కొడుకులు కూడా చేయ‌లేని సాయాన్ని ఇప్పుడు ఈ కుర్ర హీరో చేసాడు. త‌న‌ను న‌మ్ముకుని సినిమా చేసిన అల్లు అర‌వింద్ కు ఈ మ‌ధ్య కాలంలో ఎప్పుడూ చూడ‌లేన‌న్ని కోట్లు చూపిస్తున్నాడు. ఆ మ‌ధ్య ఎప్పుడో ప‌దేళ్ల కింద మ‌గ‌ధీర త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయిలో అల్లు అర‌వింద్ లాభాలు చూడ‌టం ఇదే తొలిసారి. మ‌ధ్య‌లో కూడా హిట్లు వ‌చ్చాయి కానీ మ‌రీ గీత‌గోవిందంలా గ‌ల్లాపెట్టె మాత్రం నింప‌లేదు. ఈ సినిమా ఇప్ప‌టికీ వ‌సూళ్లు తీసుకొస్తూనే ఉంది. ఓ నిర్మాత‌కు సినిమా నుంచి ఇంత‌కంటే ఇంకేం కావాలి..? ఒక‌టా రెండా ఏకంగా 115 కోట్ల మార్క్ అందుకున్నాడు విజ‌య్. మూడు వారాలు దాటినా కూడా ఇప్ప‌టికీ గీత‌గోవిందం దుమ్ము దులిపేస్తూనే ఉంది.

దూకుడు.. రేసుగుర్రంతో పాటు చాలా సినిమాలు క్రాస్ చేసింది ఈ సినిమా. గ‌బ్బ‌ర్ సింగ్ 69 కోట్లు మాత్ర‌మే మిగిలింది. ఫుల్ ర‌న్ లో గీత గోవిందం దాటేలా క‌నిపిస్తుంది. అస‌లు ఈ చిత్ర దూకుడు చూసి అల్లు అర‌వింద్ కూడా షాక్ అయ్యుంటాడు. 63 కోట్ల‌ షేర్ అనేది చిన్న విష‌యం కాదు.. పైగా ఇప్పుడు రీమేక్ రైట్స్ కింద మ‌రో 2 కోట్లు వ‌చ్చాయి అల్లు అర‌వింద్ కు. యుఎస్.. క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడు.. కేర‌ళ‌.. ఇలా ఏ ప్లేస్ చూసినా ఇప్పుడు గీత‌గోవిందం త‌ప్ప మ‌రో సినిమా క‌నిపించ‌డం లేదు. సెప్టెంబ‌ర్ 13న శైల‌జారెడ్డి అల్లుడు.. యు ట‌ర్న్ వ‌చ్చేంత‌వర‌కు కూడా ఈ సినిమా ర‌చ్చ ఆప‌డం క‌ష్టం. అందుకే కొన్నేళ్లుగా కొడుకులు కూడా చేయ‌లేని ప‌నిని ఇప్పుడు విజ‌య్ చేసి చూపించాడు. అందుకే విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు రుణ‌ప‌డిపోయాడు అల్లు అర‌వింద్.

More Related Stories