English   

పూజా ఆప్ష‌న్ కాదు.. అంద‌రికీ ఛాయిసే.. 

Pooja-Hegde
2018-09-07 11:38:10

గీత‌గోవిందం క్లైమాక్స్ లో వ‌చ్చే ఈ డైలాగ్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది క‌దా. మ‌న జీవితంలో ఏదైనా ఛాయిస్ తీసుకోవాలంటే క‌చ్చితంగా అదే తీసుకోవాల్సిందే. లేదంటే ఆప్ష‌న్ అవుతుంది. ఇప్పుడు పూజాహెగ్డే కూడా హీరోలంద‌రికీ ఆప్ష‌న్ కాదు.. ప‌క్కా తీసుకోవాల‌నిపించే ఛాయిస్. ఈ భామ కోస‌మే అంతా వేచి చూస్తున్నారు. అస‌లు ఏం మాయ చేస్తుంది పూజాహెగ్డే..? ఒక్క హిట్ కూడా లేకుండా ఎందుకు ఆ భామ వెంట అంద‌రు హీరోలు ప‌డుతున్నారు..? అంటూ అంతా బుర్ర‌లు బాదుకుంటున్నారు. దీనికి స‌మాధానం ఒక్క‌టే. స‌మంత‌, కాజ‌ల్, త‌మ‌న్నా లాంటి ముద్దుగుమ్మ‌లంతా ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు. ఇప్ప‌టికే వాళ్ల‌తో ఒక‌టికి రెండు సార్లు న‌టించేసారు మ‌న హీరోలు. దాంతో క‌చ్చితంగా కొత్త వాళ్ల‌కు చాన్స్ ఇవ్వాలి.
 
ఇప్పుడున్న వాళ్ల‌లో పూజాహెగ్డే.. కైరాఅద్వానీ మిన‌హా మ‌న హీరోల‌కు పెద్ద‌గా ఆప్ష‌న్ క‌నిపించ‌ట్లేదు. ర‌కుల్ ను కూడా లైట్ తీసుకోవ‌డంతో పూజానే అంద‌రికి ఛాయిస్ గా మారుతుంది. ఇదే ఆమెకు వ‌రంగా మారిపోయింది. మ‌హేశ్ -వంశీ పైడిప‌ల్లి మ‌హ‌ర్షి సినిమాలో పూజా హీరోయిన్ గా న‌టిస్తుంది. దిల్ రాజు నిర్మాత కావ‌డంతో పూజాకు ఇందులో అవ‌కాశం ద‌క్కింది. హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌డంలో రాజుగారు దిట్ట‌. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంది పూజా. డిజే త‌ర‌హాలో ఈ సినిమాలోనూ అమ్మ‌డు ఫుల్లుగా అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కించ‌నుంది. అక్క‌డ బికినీ అయితే ఇక్క‌డ కూడా అదే ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది.
 
ఇక ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత షూటింగ్ తోనూ బిజీగా ఉంది పూజాహెగ్డే. ఇక ఇప్పుడు మ‌రో ముద్దుగుమ్మే లేన‌ట్లు ప్ర‌భాస్ సినిమాలో కూడా ఈ భామ‌నే హీరోయిన్ గా తీసుకున్నారు. స్వ‌యంగా ప్ర‌భాస్ ఈ విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసాడు కూడా. రాదాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మానికి ఏకంగా ప్రైవేట్ ఫ్లైట్ లో వ‌చ్చింది పూజా. ప్ర‌స్తుతం ఈమె హౌజ్ ఫుల్ 4 కోసం జై స‌ల్మీర్ లో షూట్ చేస్తుంది. అక్క‌డ్నుంచి హైద‌రాబాద్ కు ఒక్క‌టే ఫ్లైట్ ఉంది.. అది న‌మ్ముకుంటే రావ‌డం క‌ష్ట‌మ‌ని ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి ప్రైవేట్ ఫ్లైట్ లో వ‌చ్చింది పూజాహెగ్డే. మొత్తానికి ఈ భామ క‌మిట్మెంట్ చూసి అంతా షాక్ అయిపోతున్నారు. 

More Related Stories