English   

సిల్లీఫెలోస్ రివ్యూ

Silly-Fellows
2018-09-07 06:29:08

సుడిగాడు త‌ర్వాత హిట్ లేని న‌రేష్.. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ భీమినేనితో క‌లిసి వ‌చ్చాడు. పైగా సునీల్ ను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సిల్లీఫెలోస్ విడుద‌లైంది. మ‌రి ఇది నిజంగానే ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకుందా లేదా అనేది చూద్దాం..

క‌థ‌:

వీర‌బాబు(అల్ల‌రి న‌రేష్) టైల‌ర్. ఎమ్మెల్యే జాకెట్ జానకిరామ్(జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి) ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా ఉంటాడు. ఓ రోజు సామూహిక వివాహాల నుంచి ఓ పెళ్లి కొడుకు త‌ప్పిపోతే ఆ స్థానంలో తన ఫ్రెండ్ సూరిబాబు(సునీల్) ను ఇరికిస్తాడు వీర‌బాబు. అలా పుష్ప‌(నందిని రాయ్) కు మోగుడు అవుతాడు సూరిబాబు. అప్ప‌ట్నుంచీ ఊరంతా పుష్ప మొగుడు అంటూ సూరిబాబును ఎక్కిరిస్తుంటారు. అదే స‌మ‌యంలో వీర‌బాబుకు పోలీస్ అవ్వాల‌నుకునే చిత్రతో వీర‌బాబుకు ప‌రిచ‌యం అవుతుంది. ఆమె ద‌గ్గ‌ర ప‌ది ల‌క్ష‌లు ఎస్సై పోస్ట్ కోసం తీసుకుని ఎమ్మెల్యేకి ఇస్తాడు వీర‌బాబు. కానీ ఎమ్మెల్యేకు యాక్సిడెంట్ అవుతుంది.. ఆయ‌న‌కు 500 కోట్ల సీక్రేట్ తెలిసి ఉంటుంది.. ఆ త‌ర్వాత ఏమైంది.. ఈ ప‌ది ల‌క్ష‌ల‌తో పాటు ఆ 500 కోట్లు ఏమ‌య్యాయి అనేది అస‌లు క‌థ‌.. 

క‌థ‌నం: 

సిల్లీఫెలోస్ పేరుకు త‌గ్గ‌ట్లు సిల్లీ క‌థే. ఇందులో చెప్పుకోడానికి పెద్ధ క‌థేం ఉండ‌దు కానీ కామెడీ మాత్రం బాగానే ఉంటుంది. తొలి సీన్ నుంచే లాజిక్ ఎక్స్ పెక్ట్ చేయొద్ద‌ని చెప్తాడు ద‌ర్శ‌కుడు భీమినేని. దానికిత‌గ్గ‌ట్లుగానే ముందు వెన‌క త‌ల‌తోక లేకుండా క‌థ ముందుకు వెళ్తుంటుంది. ఆ సీన్ లో వ‌చ్చిన సీన్స్ ను చూసి న‌వ్వుకోవ‌డ‌మే. బ్లేడ్ బాబ్జీలో పోలీస్ స్టేష‌న్ కింద డ‌బ్బులు దాచేసిన‌ట్లు.. ఇక్క‌డ జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డికి 500 కోట్ల గురించి తెలుసు.. అత‌డి ద‌గ్గ‌ర్నుంచి అవి ఎలా లాక్కోవాలా అని చూసే రెండు బ్యాచ్ లు. వాళ్ల నుంచి న‌రేష్, సునీల్ ఎమ్మెల్యేను ఎలా కాపాడారు అనేది కామెడీగా చూపించాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాఫ్ అంతా అక్క‌డ‌క్క‌డా న‌వ్వుల‌తో ప‌ర్లేద‌నిపిస్తుంది. హీరో ల‌వ్ ట్రాక్ కూడా ఓకే. సునీల్ మాత్రం పుష్ప మొగుడిగా న‌వ్వించాడు. సెకండాఫ్ కాసేపు ల్యాగ్ చేసినా కూడా జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి కామెడీతో బ‌తికిపోయింది. క్లైమాక్స్ వ‌ర‌కు దాన్ని అలాగే కొన సాగించాడు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్ లో ఎప్ప‌ట్లాగే 500 కోట్ల సీక్రేట్ సింపుల్ గా ఓపెన్ చేసి ముగించేసాడు. లాజిక్ లేని కామెడీ వ‌ర‌కు సిల్లీఫెలోస్ తో ఢోకా లేదు కానీ క‌డుపులు చెక్క‌లు కావాలంటే మాత్రం కుద‌ర‌ని ప‌ని. 

న‌టీన‌టులు:

అల్ల‌రి న‌రేష్ త‌న‌కు అల‌వాటైన పాత్ర‌లో న‌టించాడు. కొత్త‌ద‌నం ఏం లేదు. ఇక సునీల్ ప‌దేళ్ల త‌ర్వాత తానేం మిస్ అయ్యాడో అర్థం చేసుకున్నాడు. ప్రేక్ష‌కుల‌కు కూడా ఫుల్ మీల్స్ పెట్టేసాడు. ఈయ‌న ఉన్నందుకు సిల్లీఫెలోస్ రేంజ్ పెరిగింది. చిత్రాశుక్లా ప‌ర్లేదు. నందిని రాయ్ ఎక్కువ సీన్స్ లో క‌నిపించ‌క‌పోయినా.. ఆమె పేరు పుష్ప మాత్రం సినిమా అంతా న‌వ్వించింది. పోసాని.. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి.. అదుర్స్ ర‌ఘు.. ఇలా ప్ర‌తీ ఒక్క‌రు తమ త‌మ పాత్ర‌ల్లో న‌వ్వించారు. 

టెక్నిక‌ల్ టీం:

కామెడీ సినిమాల్లో పాట‌ల గురించి పెద్ద‌గా మాట్లాడుకోవాల్సిన ప‌నిలేదు. కానీ ఇందులో హెడ్డేక్ సాంగ్ లో లిరిక్స్ అద్బుతంగా రాసాడు కాస‌ర్ల శ్యామ్. రాజ‌కీయ నాయ‌కుల‌కు భారీగా సెటైర్లు వేసాడు. ఎడిటింగ్ ప‌ర్లేదు. సెకండాఫ్ మొద‌ట్లో కాసేపు ల్యాగ్ అనిపించింది. సినిమాటోగ్ర‌ఫీ ఓకే. ద‌ర్శ‌కుడిగా భీమినేని బాగానే స‌క్సెస్ అయ్యాడు. మ‌రోసారి రీమేక్ సినిమానే తీసుకుని ఓకే అనిపించాడు. అయితే సుడిగాడు ముందు ఈ చిత్రం నిల‌బ‌డ‌లేదు. అయితే కొన్నేళ్లుగా న‌రేష్ సినిమాల‌తో పోలిస్తే ఇది బెట‌ర్.

చివ‌ర‌గా: సిల్లీఫెలోస్.. కామెడీకి కేరాఫ్ అడ్ర‌స్.. కండీష‌న్స్ అప్లై.. 

రేటింగ్: 3/5 

More Related Stories