English   

అయ్య‌య్యో దేవ‌దాస్ కు ఎంత క‌ష్ట‌మొచ్చిందో..? 

DevaDas-rights
2018-09-07 15:29:40

దేవ‌దాస్ అంటేనే క‌ష్టాల‌కు కేరాఫ్ అడ్ర‌స్. ఆయ‌న ఏం చేసినా క‌ష్టం త‌ప్ప ఎప్పుడూ ఇంకోటి తోడు రాలేదు. అయితే ఈ టైటిల్ తో వ‌చ్చిన సినిమాలు మాత్రం ఎప్పుడూ మోసం చేయ‌లేదు. నిర్మాత‌ల‌కు బాగానే డ‌బ్బులు అయితే తీసుకొచ్చాయి. ఇప్పుడు దేవ‌దాస్ అంటూ నాగార్జున‌, నాని కూడా వ‌స్తున్నాయి. ఈ సినిమాకు ముహూర్తం పెట్టిన‌పుడు అంచ‌నాలు భారీగా ఉన్నాయి. పైగా అప్ప‌టికి నాని ఫుల్ స్వింగులో ఉన్నాడు. ఈ హీరో క‌థ‌కు ఓకే చెబితే చాలు సినిమా హిట్టే అనే న‌మ్మ‌కంతో ఉన్నారంతా. కానీ ఇప్పుడు సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో కార‌ణ‌మేంటో తెలియ‌దు కానీ దేవ‌దాస్ పై న‌మ్మ‌కాలు త‌గ్గిపోతున్నాయి. 

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్ర ఓవ‌ర్సీస్ రైట్స్ అమ్ముడుకాలేదంటే న‌మ్మ‌డానికి ఆశ్చ‌ర్యమే. నాని, నాగార్జున లాంటి స్టార్స్ ఉన్నా కూడా ఎందుకో ఇప్ప‌టి వ‌ర‌కు దేవ‌దాస్ రైట్స్ తీసుకోలేదు. బ‌హుశా నానికి కృష్ణార్జున యుద్ధం.. నాగార్జున‌కు ఆఫీస‌ర్ ఫ్లాపుల ప్ర‌భావం క‌లిపి దేవ‌దాస్ పై ప‌డిందేమో మ‌రి. కార‌ణం ఏదైనా కానీ ఇంత భారీ సినిమా రైట్స్ ఇప్ప‌టి వ‌ర‌కు అమ్ముడు కాక‌పోవ‌డం మాత్రం క‌చ్చితంగా షాకే. మూడేళ్లుగా సూప‌ర్ ఫామ్ లో ఉన్న నానికి ఓవ‌ర్సీస్ రైట్స్ స‌మ‌స్య రావ‌డం ఇదే తొలిసారి. కృష్ణార్జున యుద్ధం ఫ‌లిత‌మే ఇప్పుడు దేవ‌దాస్ ను శాసిస్తుంది. నిర్మాత అశ్వినీద‌త్ అడిగిన రేట్ అక్క‌డ ఇంకా రావ‌డం లేదు. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది ఈ చిత్రం. చూడాలిక‌.. అప్ప‌టి వ‌ర‌కు దేవ‌దాస్ ను ఎవ‌రు ద‌క్కించుకుంటారో..? 

More Related Stories