English   

ఎన్టీఆర్ వల్ల పూజా హెగ్డేకు ‘ప్రైవేట్’ కష్టాలు

Pooja-Hegde
2018-09-07 17:39:12

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఫస్ట్ టైమ్ రూపొందుతోన్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. హారిక హాసిని బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీని అక్టోబర్ 11న విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత వారినికి అక్టోబర్ 19న దసరా పండగ. అంటే అభిమానులకు వారం ముందుగానే దసరా సంబురాలు తీసుకురాబోతున్నాడు యంగ్ టైగర్. అయితే ఈ మధ్య అనుకోకుండా ఆయన తండ్రి హరికృష్ణ మరణించడంతో ఈ మూవీ ఆలస్యం అవుతుందనుకున్నారు. కానీ అలా జరగకుండా ఎన్టీఆర్ తండ్రి మరణించిన నాలుగో రోజు నుంచే తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే ఆ నాలుగు రోజుల్లోనే కొన్ని కీలకమైన సన్నివేశాలు హీరో, హీరోయిన్ల మధ్య చిత్రీకరించాల్సి ఉందట. దీంతో పూజా హెగ్డే డేట్స్ మిస్ అయ్యాయి. మరోవైపు తను బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్-4’లో నటిస్తోంది. ఈ నాలుగు రోజుల తర్వాత తను అక్కడ డేట్స్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆ నాలుగు రోజులను కూడా కవర్ చేయాల్సి వచ్చింది. అందుకే తను ఒకే డేట్ లో రెండు సినిమాలు చేస్తూ నానా తంటాలు పడుతోంది.

ప్రస్తుతం అరవింద సమేత వీరరాఘవ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అటు హౌస్ ఫుల్4 షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతోంది. అంటే ఇక్కడ తన వర్క్ కాగానే వెంటనే అక్కడికి వెళ్లిపోతోందట. అదెలా సాధ్యం అంటారా..? రాజు తలచుకుంటే.. అన్నట్టుగా నిర్మాతలు తలచుకుంటే సాధ్యం కానివి ఏముంటాయి. అందుకే తనకోసమే స్పెషల్ గా ఓ ‘‘ప్రవేట్ జెట్’’ కేటాయించారట. అంటే ఇక్కడ తన వర్క్ కాగానే ఆ ప్రైవేట్ జెట్ లో రాజస్థాన్ కు వెళుతుందన్నమాట. నిజానికి ఎంత విమానమైనా ఇలా ఒకే రోజు వేల కిలోమీటర్లు జర్నీ చేయడం చిన్న విషయం కాదు. మొత్తంగా అరవిందుడు కోసం ఈ అమ్మడి కష్టాలు భరిస్తోందన్నమాట. 

More Related Stories