English   

రవిబాబు ‘బంటీ’ చాలా అల్లరోడు

Adhugo-Teaser-talk
2018-09-07 18:45:29

క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు మరో సాహసం చేస్తున్నాడు. ఇప్పటి వరకూ చాలా సాధు జంతువులు ప్రధాన పాత్రలుగా సినిమాలు వచ్చాయి. ఆఖరుకి మనకు ఈగ కూడా హీరో అయింది. కానీ ఓ వరాహంతో రాలేదు. వస్తుందనే ఊహ కూడా ఎవరికీ లేదు. కానీ ఓ పిగ్ లెట్ ను ప్రధానంగా చేసుకుని రవిబాబు డైరెక్షన్ లో వస్తోన్న సినిమా ‘అదుగో’ ఈ సినిమా కోసం చాలాకాలంగా కష్టపడుతున్నాడు రవిబాబు. కొన్నాళ్ల క్రితం తన పిగ్ లెట్ తో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేసిన రవిబాబు అదుగో టీజర్ విడుదల చేశాడు. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా ఉంది. 

తన పిగ్ లెట్ పేరు బంటీ. ఆ బంటీ చాలా చేస్తుంది. ఆ విషయాన్నే టీజర్ లో చూపించాడు. మనం మాట్లాడేది బంటీకి బాగా తెలుస్తుంది. అందుకే ఏం చేయమన్నా చేస్తుంది. చెప్పిన ప్రతిమాటా వింటుంది. అంతేకాదు.. బంటీ కాస్త అల్లరోడు కూడా. ఒక్కోసారి మాట వినకుండా తనకు నచ్చినట్టే చేస్తుంటాడు. అది కూడా ఫన్నీగానే ఉంటుంది.. ఈ విషయాలన్నీ టీజర్ లో హైలెట్ చేశాడు రవిబాబు. ఈ పిగ్ లెట్(సారీ బంటీ) తో డ్యాన్ లు కూడా చేయించాడు. ఇక ఈ నెల 12న థియేట్రికల్ ట్రైలర్ ను కూడా విడదల చేస్తున్నట్టు ఈ టీజర్ లో చెప్పారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో కానీ.. ప్రస్తుతం ది బెస్ట్ మూవీస్ ను పిక్ చేసుకుని రిలీజ్ చేస్తోన్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రవిబాబు సినిమా వెనక ఉంది. అంటే సినిమా మాగ్జిమం బావుండబోతున్నట్టే అనుకోవచ్చు. కాకపోతే ట్రైలర్ చూస్తే మరికాస్త క్లారిటీ వస్తుందేమో.

More Related Stories