English   

రజినీకాంత్ ‘పెట్ట’ బిల్డప్ అదిరింది

Petta-poster
2018-09-07 19:11:11

రజినీకాంత్ బిల్డప్ అదిరింది..  ఎందుకో కొన్నాళ్లుగా రజినీకాంత్ సినిమాలు చూస్తుంటే ఈ మాటే అనాలనిపిస్తోంది. కారణం.. ఫస్ట్ లుక్స్, టీజర్స్ అదిరిపోతాయ్. కానీ సినిమాల వరకూ వచ్చే సరికి అంత సీన్ కనిపించడం లేదు. అందుకే ముందే బిల్డప్ అనుకుంటే తర్వాత తేడా కొట్టినా ప్రాబ్లమ్ ఉండదు కదా.. ఇంతకీ మేటర్ ఏంటంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘పెట్ట’. ఇప్పటి వరకూ థ్రిల్లర్ మూవీస్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ఇది. లేటెస్ట్ గాఈ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అందువల్ల ముందే చెప్పినట్టు ఆ పోస్టర్ అదిరిపోయింది. రజినీకాంత్ బిల్డప్ ఎప్పట్లానే పవర్ హౌస్ గా కనిపిస్తోంది. 

‘పెట్ట’.. ఓ పాడుబడ్డ ఇంట్లో లైట్ స్టాండ్ తో వస్తుంటాడు రజినీ.. ఓ కత్తి వేగంగా అటువైపు వస్తుంది.. తన స్టాండ్ తో కత్తిని ఆపేస్తాడు. ఇదే మోషన్ తో ఉన్న పోస్టర్. రజినీకాంత్ లుక్ మరోసారి మాస్ కా బాప్ అన్నట్టుగా అదిరిపోయింది. ఇక అత్యంత భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ మూవీని సన్ ప్రొడక్షన్స్ అధినేత కలైనిధి మారన్ నిర్మిస్తున్నాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి విలన్స్ గా నటిస్తుండటం విశేషమైతే.. చాలా రోజుల తర్వాత నటి సిమ్రన్ ఈ మూవీలో విలన్ గా రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతానికి త్రిష హీరోయిన్ అనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే మరో హీరోయిన్ కూ స్పేస్ ఉంటుంది. ఇక అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అతనికి ఇంత చిన్న వయసులోనే ఎందుకు అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది తెలియాంలే ఈ మోషన్ పోస్టర్ లోని బిజిఎమ్ చాలు.. మొత్తంగా పెట్ట వచ్చే యేడాది వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కాదంటే సంక్రాంతికే వచ్చినా ఆశ్చర్యం లేదు.

More Related Stories