English   

సమంత సినిమా సెన్సార్ టాకేంటీ..?

Samantha-U-Turn
2018-09-07 19:57:50

హిట్ మెషీన్ సమంత కొత్త మూవీ ‘యూ టర్న్’ సెన్సార్ పూర్తయింది. ఈ నెల 13న విడుదల కాబోతోన్న ఈ మూవీకి సంబంధించి సమంత ఇప్పటికే చాలా గొప్పగా చెప్పుకుంటోంది. కన్నడలో 2016లో సూపర్ హిట్ అయిన యూ టర్న్ సినిమాను అదే పేరుతో తెలుగులో చేసిన రీమేక్ ఇది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ అదే రోజు విడుదల కాబోతోంది. పవన్ కుమార్ డైరెక్ట్ చేసిన యూ టర్న్ లో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమికా చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. సస్పెన్స్, హారర్ అండ్ మిస్టీరియస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీతో సమంత తన హజ్బెండ్ నాగ చైతన్యతో సెప్టెంబర్ 13న బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టబోతోంది. 

ఇక ఈ మూవీకి సెన్సార్ నుంచి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. కాస్త హారర్ కంటెంట్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి కాబట్టే ఈ సర్టిఫికెట్. ఇక సెన్సార్ నుంచి మూవీకి మంచి ప్రశంసలు వచ్చాయని చెబుతున్నారు. గ్రిప్పీ థ్రిల్లర్ అని సెన్సార్ నుంచి టాక్ వచ్చిందని చెబుతున్నారు. అయితే సమంత ఉంది కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చుతుందని చెప్పలేం. కాకపోతే సమంతకు ఈ కంటెంట్ విపరీతంగా నచ్చడం వల్లే ఈ సినిమా తెలుగు అండ్ తమిళ్ లోకి రీమేక్ అయిందనేది తను ముందు నుంచీ చెబుతూ వస్తున్నదే. ఇక సమంత నటించిన మరో తమిళ్ సినిమా సీమరాజా కూడా సెప్టెంబర్ 13నే విడుదల కాబోతుండటంతో పాటు తన భర్త నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ అదే రోజు వస్తుండటంతో ఈ డేట్ సమంతకు కాస్త స్పెషల్ అనే చెప్పాలి.

More Related Stories