English   

మహేష్ ఫోటో వెనకాల దాగి ఉన్న స్టోరీ

Mahesh Babu Liked Photographer Avinash Gowariker Click
2018-09-07 20:21:11

కొన్నిసార్లు తెలియకుండా జరిగినే బాగా నచ్చుతాయి. కావాలని ఫోటోస్ దిగినప్పుడు అంత నేచురల్ గా కనిపించదు. కానీ మనకు తెలియకుండా ఓ స్టిల్ వస్తే ఫిదా అయిపోతాం.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే ఫీల్ లో ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న మహర్షి సినిమా షూటింగ్ టైమ్ లో తీసిన ఈ ఫోటో కూడా మహేష్ బాబును అలాగే ఆకట్టుకుంది. అందుకే ఆ ఫోటోగ్రాఫర్ కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. ఈ స్టిల్ మహర్షి సినిమా షూటింగ్ సందర్భంగ సాయంత్ర పేకప్ టైమ్ కు కాస్త ముందుగా తీశారట. అవినాష్ గోవారికర్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ఇది. ఇతను సెలబ్రిటీ ఫోటోగ్రఫర్ గా చాలా ఫేమస్. అతనే ఫస్ట్ ఈ ఫోటోను ట్వీట్ చేశాడు. దాన్ని రీ ట్వీట్ చేస్తూ మహేష్ బాబు అతనికి థ్యాంక్స్ చెప్పడం విశేషం.

ప్రస్తుతం మహరాష్ట్రలో మహర్షి షూటింగ్ జరుగుతోంది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో అతను కాలేజ్ స్టూడెంట్ గా కనిపించబోతుండటం మరో విశేషం. అలాగే అల్లరి నరేష్ ఈ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారుతున్నాడు. ఇది సూపర్ స్టార్ కు 25వ సినిమా. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ తెరకెక్కిస్తున్నారు. అశ్వనీదత్, దిల్ రాజు, పివిపి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న మహర్షి వచ్చే యేడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

More Related Stories