English   

అల్లు అర్జున్ సైడ్ రోల్ చేయబోతున్నాడా..?

Allu Arjun Going To Bollywood For Kapil Dev Biopic
2018-09-07 21:43:52

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇంత గ్యాప్ ఎప్పుడూ ‘తీసుకోలేదు’. అది కూడా ఓ సినిమా పోయిందని. యస్.. తనెంతో నమ్మకం పెట్టుకున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో రీ థాట్ లో పడ్డాడు బన్నీ. అంతకు ముందు చేసిన సినిమాలు కూడా బెస్ట్ రెవిన్యూ తెచ్చుకున్నాయి కానీ రివ్యూస్ కాదు. అంటే తను కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు కానీ.. కంటెంట్ ఉన్న సినిమాలు కాదు అని అతనికే అర్థమైంది. అందుకే నా పేరు సూర్య చేశాడు. బట్ ఇది దారుణంగా నిరాశపరిచింది. దీంతో మరో కొత్త సినిమా ఒప్పుకోకుండా దాదాపు ఆరు నెలలకు పైగా ఖాళీగానే ఉంటున్నాడు. నెక్ట్స్ ఏంటీ అనే ప్రశ్నకు ఏ సమాధానం దొరకలేదింత వరకూ. ఇన్నాళ్లుగా అభిమానులను సస్పెన్స్ లో ఉంచేసిన బన్నీ.. ఓ బయోపిక్ లో నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.  అది కూడా ఓ స్టార్  క్రికెట్ ప్లేయర్ లైఫ్ స్టోరీ ఆధారంగా రాబోతోన్న సినిమాలోనట.  ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్కుల ట్రెండ్ నడుస్తోంది. కానీ బాలీవుడ్ లో ఇదెప్పుడో మొదలైంది. అక్కడా ఇక్కడా వీటికి మంచి ఆదరణే ఉంటోంది. పైగా బాగా నటించే అవకాశం కూడా వస్తుంది. అందుకే బన్నీ కూడా ఓ బయోపిక్ లో నటించబోతోన్నాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది. మరి బన్నీ నటిస్తోన్న ఆ బయోపిక్ ఎవరిదో తెలుసా..?

ఇండియాలో క్రికెట్ క్రేజ్ తెచ్చిన స్టార్ ఎవరు.. మరో డౌట్ లేకుండా ఎవరైనా చెప్పే పేరు కపిల్ దేవ్. 1983లో ఒంటి చేత్తో వరల్డ్ కప్ తెచ్చిన కపిల్ కు కోటానుకోట్లమంది అభిమానులున్నారు. ఇప్పుడు ఆయన జీవితమే వెండితెరపై రాబోతోంది. అంటే ఈ బయోపిక్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ 1983 వరల్డ్ కప్. ఆ కప్ తెచ్చిన టీమ్. ఇప్పుడా టీమ్ లోని ఓ మెయిన్ క్రికెటర్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ క్రెకెటర్ మరెవరో కాదు.. కృష్ణమాచారి శ్రీకాంత్. బ్యాటింగ్ హిట్టర్ గా పేరున్న శ్రీకాంత్ అప్పట్లో ఓపెనర్. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడిగానూ పేరుంది. 1983 వరల్డ్ కప్ తర్వాత 1989లో అతను కెప్టెన్ గానూ వ్యవహరించాడు. మొత్తంగా ఈ శ్రీకాంత్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నాడని అది కూడా హీరో రోల్ కాదు అని బాలీవుడ్ నుంచే వార్తలు వస్తుండటం విశేషం.. మరి అది నిజమా కాదా అనేది బన్నీయే తేల్చాలి.

More Related Stories