English   

ఉన్న‌ట్లుండి షాక్ ఇచ్చిన ర‌జినీ

Latest Updates of Rajinikanth's Two Movies
2018-09-08 08:01:34

ఇన్నాళ్లూ కామ్ గా త‌న‌కేం సంబంధం లేద‌న్న‌ట్లు ఉన్న ర‌జినీకాంత్.. స‌డ‌న్ గా షాక్ ఇచ్చాడు. రెక్క‌లు విప్పిన ప‌క్షిలా ఎగురుకుంటూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. రెండు రాయబారాల‌ను తీసుకొచ్చాడు. ఒక‌టి ఎప్ప‌ట్నుంచో ఊరిస్తున్న 2.0 టీజ‌ర్ విడుద‌ల తేదీ అయితే మ‌రోటి కార్తిక్ సుబ్బ‌రాజ్ సినిమా టైటిల్. దీనికి పెట్ట అనే విచిత్ర‌మైన టైటిల్ పెట్టాడు ద‌ర్శ‌కుడు. తెలుగులోనూ ఇదే టైటిల్ ఉంటుందా.. లేదంటే ఇక్క‌డ మ‌రో టైటిల్ కోసం చూస్తారా అనేది స‌స్పెన్స్. మ‌రోవైపు 2.0 టీజ‌ర్ సెప్టెంబ‌ర్ 13న రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పైగా దీన్ని బాలీవుడ్ లో క‌ర‌ణ్ జోహార్ త‌న ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ లో బాహుబ‌లి 2 కంటే భారీగా విడుద‌ల చేయ‌డానికి చూస్తున్నాడు.

ప్ర‌భాస్ తో ఆ మ‌ధ్య క‌ర‌ణ్ జోహార్ కు గొడ‌వ అయింది. అప్ప‌ట్నుంచి బాహుబ‌లి 2 రికార్డుల‌ను ప‌డ‌గొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు ఈ ద‌ర్శ‌క నిర్మాత‌. అయితే దాన్ని కొట్టే మొన‌గాడు ఎవ‌రా అని చూస్తున్న క‌ర‌ణ్ కు ర‌జినీకాంత్ క‌నిపించాడు. అనుకున్న‌దే త‌డువు ఇప్పుడు 2.0 హ‌క్కుల‌ను త‌న సొంతం చేసుకున్నాడు. మ‌రోవైపు ర‌జినీ కాంత్ కూడా ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉండి ఒకేసారి త‌న రెండు సినిమాల గురించి అప్డేట్స్ ఇచ్చాడు. 2.0 ఇదే ఏడాది వ‌స్తుంటే.. పెట్ట మాత్రం వ‌చ్చే ఏడాది రానుంది. ఇందులో ప‌గ‌లు హాస్ట‌ల్ వార్డెన్ గా.. రాత్రి పూట డాన్ గా న‌టిస్తున్నాడు ర‌జినీ.

More Related Stories