English   

సునీల్ ఈజ్ బ్యాక్.. మ‌రి అల్ల‌రోడి ప‌రిస్థితేంటి..? 

silly-fellows
2018-09-08 03:47:17

సిల్లీఫెలోస్ సినిమా చూసిన వాళ్లంతా మ‌రో మాట లేకుండా సునీల్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. తొమ్మిదేళ్ల త‌ర్వాత చిరంజీవికి ఖైదీ నెం.150తో ఎలా అయితే గ్రాండ్ వెల్ క‌మ్ ఇచ్చారో.. సునీల్ కు కూడా అంతే రేంజ్ లో వెల్ క‌మ్ ప‌లికారు అభిమానులు. ముఖ్యంగా ఆయ‌న కామెడీని ఇన్నేళ్లుగా ఎంత మిస్ అయ్యారో ఇప్పుడు సిల్లీఫెలోస్ చూస్తుంటే అర్థ‌మైపోతుంది. ఈ సినిమాలో హీరోతో వెన్నండే ఉండే పాత్ర‌లో న‌టించాడు సునీల్. న‌రేష్ కు అన్ని విధాల సహ‌కారం అందించాడు. ఆయ‌న లేక‌పోతే సినిమానే లేదు అన్నంత‌గా క‌థ‌లో లీన‌మైపోయాడు. పైగా పుష్ప మొగుడు అంటూ ట్యాగ్ లైన్ ఒక‌టి వేసుకుని సినిమా అంతా న‌వ్వించాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. ప‌దేళ్లు గ్యాప్ ఇచ్చినా కూడా లోప‌ల ఒరిజిన‌ల్ మాత్రం అలాగే ఉంద‌ని ఈ చిత్రంతో నిరూపించాడు సునీల్. ఇక రాబోయే సినిమాల‌కు ఎలాంటి ఢోకా అవ‌స‌రం లేదు. క‌మెడియ‌న్ గా మారిపోయి.. మ‌ళ్లీ త‌న స్థాయి త‌నే త‌గ్గించుకున్నాడు ఈ మాజీ హీరో. అయితే ఇదే సినిమాలో అల్ల‌రి న‌రేష్ మాత్రం మ‌ళ్లీ అక్క‌డే ఆగిపోయాడు. ఈయ‌న అల‌వాటైన పాత్ర‌లో బాగానే న‌టించాడు కానీ న‌రేష్ కెరీర్ కు సిల్లీఫెలోస్ ఎంత‌వ‌ర‌కు హెల్ప్ అవుతుంద‌నేది చూడాలిక‌. చూసిన వాళ్లంతా సునీల్ సూప‌ర్ అంటున్నారే కానీ ఒక్క‌రు కూడా అల్ల‌రోడు భ‌లే చేసాడే అన్న‌వాళ్లే లేరు. ఎంత‌సేపూ సునీల్ ఉన్నందుకే సినిమా చూడాల‌నిపించింది అంటున్నారు కానీ అల్లరి న‌రేష్ కూడా కామెడీ బాగా చేసాడు అని నోరారా అన‌డం లేదు. అదృష్టం బాగుండి కామెడీ వ‌ర్క‌వుట్ అయి సినిమాకు డ‌బ్బులొస్తే మాత్రం ఆ క్రెడిట్ అంతా మ‌రో అనుమానం లేకుండా సునీల్ ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇది రాబోయే అర‌వింద స‌మేత‌.. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. సైరా.. చిత్ర‌ల‌హ‌రి లాంటి సినిమాల‌కు బాగా హెల్ప్ కానుంది. 

More Related Stories