English   

"మా"కు సిగ్గు రాలేదా.. న‌డిగ‌ర్ సంఘాన్ని చూడండి..

MAA-Association
2018-09-08 11:57:04

బాలీవుడ్ త‌ర్వాత అంత పేరున్న ఇండ‌స్ట్రీ ఏదంటే మొన్న‌టి వ‌ర‌కు త‌మిళం అనేవాళ్లు కానీ ఇప్పుడు మాత్రం తెలుగు ఇండ‌స్ట్రీ అంటున్నారు. ఇంత గొప్ప‌గా చెప్పుకునే మ‌న ఇండ‌స్ట్రీకి క‌నీసం ఓ బిల్డింగ్ కూడా లేదు.. 20 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు కానీ ఇప్పటి వ‌ర‌కు క‌నీసం ఓ బిల్డింగ్ ను క‌ట్ట‌లేక‌పోయారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్. వాళ్ల‌ మ‌ధ్య గొడ‌వ‌లు ప‌డ‌టానికే స‌మ‌యం స‌రిపోవ‌డం లేదు ఇంక బిల్డింగులు ఎక్క‌డ క‌డ‌తారు..? ఇప్పుడు ఇదే స‌గ‌టు సినిమా అభిమాని మ‌న‌సులో ఉన్న అనుమానం. ఇప్పుడు కూడా వాళ్ల వివాదాలు ముదిరి పాకాన ప‌డ్డాయి. మూడేళ్ల కింద జ‌రిగిన సీన్ ఇప్పుడు మ‌ళ్లీ జ‌రుగుతంది. అప్పుడు జ‌య‌సుధ‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ మ‌ధ్య జ‌రిగిన అధికార పోరు ఇంతింత కాదు. ఇప్పుడు మ‌ళ్లీ న‌రేష్, శివాజీరాజా ఒకే గ్రూప్ లో ఉండి చివ‌రికి ఒక‌ర్నొక‌రు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు సీనియ‌ర్ న‌రేష్ ఏకంగా శివాజీరాజాపై కొన్ని ఆధారాల‌తో స‌హా మీడియా ముందుకొచ్చి డ‌బ్బులు తిన్నాడ‌ని చెప్పాడు. దాంతో రాజా అండ్ టీం కూడా సీరియ‌స్ గా రియాక్ట్ అవుతున్నారు. నిజాయితీగా ప‌నులు చేయాల‌ని చూస్తే త‌మ‌కు ఇచ్చే ప్ర‌తిఫ‌లం ఇదేనా అంటూ వాళ్లు కూడా కౌంట‌ర్ అటాక్ చేస్తున్నారు.

ఈ గొడ‌వ‌ల‌ను చూసి చిరంజీవి కూడా సీరియ‌స్ అయ్యాడ‌ని తెలుస్తుంది. ఎవ‌రి ప‌ని వాళ్లు చేసుకోకుండా కావాల‌నే నాట‌కాలు చేస్తున్నారా అంటూ సీరియ‌స్ అయ్యాడు మెగాస్టార్. ఇదిలా ఉంటే క‌నీసం త‌మిళ ఇండ‌స్ట్రీని చూసి అయినా మ‌నోళ్ల‌కు సిగ్గు రావ‌డం లేదా అంటూ నేరుగానే కొంద‌రు ఫైర్ అవుతున్నారు. ప‌క్క‌నున్న న‌డిగ‌ర్ సంఘం విశాల్ అధ్య‌క్ష‌త‌ను ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 35 కోట్ల నిధులు స‌మ‌కూర్చింది. క‌న్న‌డ‌లో కూడా 10 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు చేసి సొంత బిల్డింగ్ క‌ట్టుకున్నారు. కానీ మ‌న ద‌గ్గ‌ర మాత్రం ఇంకా అది జ‌రుగుతూనే ఉంది. ఎన్నాళ్లు జ‌రుగుతుందో కూడా చెప్ప‌డం లేదు మ‌నోళ్లు. మ‌హేశ్ బాబుతో చేయాల‌నుకున్న ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది. ఈయ‌న అమెరికా వెళ్ల‌ట్లేదు. మా అసోసియేష‌న్ కోసం ఎలాంటి కార్య‌క్ర‌మం చేయ‌డం లేదు. న‌రేష్ ని బ‌య‌ట‌కి పంపడం.. మ‌హేశ్ రాక‌పోవ‌డంతో మా ఇప్పుడు ఎటూ క‌ద‌ల్లేని స్థితిలో ఉంది. దానికి తోడు ప‌క్క‌నున్న ఇండ‌స్ట్రీలు మ‌న‌కంటే ఎక్కువ సంపాదిస్తుంటే చూసి ఏడ‌వ‌డం త‌ప్ప మ‌నోళ్లు ఇంకేం చేయ‌లేక‌పోతున్నారు. క‌నీసం న‌డిగ‌ర్ సంఘం అభివృద్ధి చూసిన త‌ర్వాతైనా మ‌నోళ్ల‌లో క‌ద‌లిక వ‌స్తే చాల‌నుకుంటున్నారు సినిమా వాళ్లు. 

More Related Stories