English   

బిగ్ బాస్ పొడుగైంది.. నాని సొంత లాభం.. 

Nani-Bigg-Boss
2018-09-08 12:39:23

సొంత లాభం కొంత మానుకో అన్నారో పెద్దాయ‌న‌. కానీ ఇక్క‌డ నాని మాత్రం సొంత లాభం ముందు చూసుకో అంటున్నాడు. త‌న సినిమా కోసం బిగ్ బాస్ 2 షెడ్యూల్ నే మార్చేసాడు న్యాచుర‌ల్ స్టార్. ఇప్ప‌టికే ఈ షో మొద‌లై మూడు నెల‌లు అయింది. జూన్ 9న గ్రాండ్ గా షురూ అయింది బిగ్ బాస్ 2. ప‌డుతూ లేస్తూ బాగానే నిల‌బ‌డింది ఈ షో. మొద‌ట్లో కాస్త విమ‌ర్శ‌లు వ‌చ్చినా కూడా ఇప్పుడు బాగానే స్థిర‌ప‌డిపోయింది రేటింగ్ ప‌ట్టిక‌లో. 106 రోజుల పాటు ఈ షో షెడ్యూల్ ఉంది. దీన్నిబ‌ట్టే అంతా ప్లాన్ చేసుకున్నారు నిర్వాహ‌కులు. అయితే ఇప్పుడు చివ‌రి నిమిషంలో నాని ఎంట్రీ ఇచ్చాడు. దాంతో బిగ్ బాస్ 2 ముగియాల్సిన టైమ్ కు ఎండ్ కార్డ్ ప‌డ‌ట్లేదు. 

నాని చెప్పినందుకు మ‌రో వారం పొడుగైంది. అంటే 113 రోజుల పాటు ఈ సీజ‌న్ ఉండ‌బోతుంద‌న్న‌మాట‌. ఇదంతా త‌మ సినిమా దేవ‌దాస్ కోస‌మే. సెప్టెంబ‌ర్ 27న ఈ చిత్రం విడుద‌ల కానుంది. షెడ్యూల్ ప్ర‌కారం అయితే అప్ప‌టికే బిగ్ బాస్ 2 పూర్తి కావాలి. కానీ త‌మ సినిమా కోసం హోల్డ్ లో పెట్టారు. సెప్టెంబ‌ర్ 30న బిగ్ బాస్ 2 ఫైన‌ల్ గ్రాండ్ గా జ‌ర‌గ‌బోతుంది. దీనికి కంటెస్టెంట్లు అంతా రానున్నారు. ఎన్టీఆర్ ను పిల‌వాల‌ని ముందు ప్లాన్ చేసినా కూడా ఇప్పుడు ఆయ‌న ఉన్న ప‌రిస్థితుల్లో వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు. ఇదిలా ఉంటే సెప్టెంబ‌ర్ 27న త‌మ సినిమా వేడుక‌ను బిగ్ బాస్ హౌజ్ లోనే చేసుకుంటున్నారు నాని అండ్ నాగార్జున‌. మొత్తానికి త‌మ సొంత లాభం కోసం బిగ్ బాస్ ను వాడేసుకున్నాడు న్యాచుర‌ల్ స్టార్. 

More Related Stories