English   

 స‌ల్మాన్ ను గ‌ట్టిగా కొట్టిన చ‌ర‌ణ్.. 

Magadheera-Sultan
2018-09-08 16:25:39

బాలీవుడ్ హీరోల‌కు ఈ మ‌ధ్య తెలుగు వాళ్ల‌తో కూడా దోస్తానా బాగానే కుదురుతుంది. ఇందులో ముందు వ‌ర‌స‌లో ఉంటాడు స‌ల్మాన్, చ‌ర‌ణ్. వీళ్ల ఇద్ద‌రికి అన్నాద‌మ్ముల అనుబంధం. స‌ల్మాన్ హైద‌రాబాద్ కు వ‌చ్చినా..  చ‌ర‌ణ్ ముంబైకు వెళ్లినా ఆతిథ్యంతో చంపేస్తారు. అలాంటి వాళ్ల మ‌ధ్య పోటీ వ‌చ్చిందిప్పుడు. ఈ పోటీలో త‌మ్ముడే గెలిచాడు. అంటే రామ్ చ‌ర‌ణ్ భారీ తేడాతో కండ‌ల‌వీరున్ని చిత్తు చేసాడ‌న్న‌మాట‌. ఇంత‌కీ ఎప్పుడు ఎక్క‌డ పోటీ ప‌డ్డారో తెలుసా..? ఇద్ద‌రూ త‌మ త‌మ పాత సినిమాల‌తో ప‌క్క దేశాల్లో దండ‌యాత్ర‌కు వెళ్లారు. చ‌ర‌ణ్ ఏకంగా ప‌దేళ్ల నాటి సినిమాతో యుద్ధానికి వెళ్తే.. మూడేళ్ల కింది సినిమాతో స‌ల్మాన్ స‌మ‌రానికి సై అన్నాడు. చైనాపై సుల్తాన్ యుద్ధం.. జ‌పాన్ పై మ‌గ‌ధీరుడి యుద్ధం ఒకేరోజు జ‌రిగాయి. 

ప‌దేళ్ల కింది సినిమా అయినా కూడా మ‌గ‌ధీర‌లోని ప్రేమ‌కు జ‌ప‌నీయులు ప‌డిపోతున్నారు. అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు ముత్తు త‌ప్ప మ‌రే ఇండియ‌న్ సినిమా 2 మిలియ‌న్ అందుకున్నదే లేదు. ఇప్పుడు మ‌గ‌ధీరుడు ఆ ప‌ని చేసాడు. ఈ సినిమా ఇప్ప‌టికీ మంచి వ‌సూళ్లు సాధిస్తుంది. విడుద‌లైన నాలుగు రోజుల త‌ర్వాత కూడా దూసుకుపోతున్నాడు మ‌గ‌ధీర‌. ఇక చైనాలో స‌ల్మాన్ మాత్రం చ‌ప్ప‌బ‌డిపోయాడు. తొలిరోజే అక్క‌డ ఈ చిత్రం డిజాస్ట‌ర్ అని అర్థ‌మైపోయింది. దానికి త‌గ్గ‌ట్లే త‌ర్వాత కూడా వ‌సూళ్లు రాలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 40 కోట్లు కూడా వ‌సూలు కాలేదు. ఇలా చూసుకుంటే జ‌పాన్ లో రాజ‌మౌళి బాహుబ‌లి చ‌లువ‌తో చ‌ర‌ణ్ జెండా పాతేస్తే.. భ‌జ‌రంగీ భాయీజాన్ తో చైనాలో పాతిన జెండాను సుల్తాన్ తో రివ‌ర్స్ తెచ్చుకున్నాడు స‌ల్మాన్ ఖాన్. 

More Related Stories