English   

ర‌జినీకాంత్ ను రెచ్చ‌గొడుతున్న ప్ర‌భాస్.. 

rajinikanth-baahubali
2018-09-08 17:20:01

ర‌జినీకాంత్ ను ప్ర‌భాస్ ఎందుకు రెచ్చ‌గొడ‌తాడు అనుకుంటున్నారా..? ఇది సినిమా ఇండ‌స్ట్రీ.. ఇక్క‌డ ఏదైనా జ‌ర‌గొచ్చు. బిగ్ బాస్ కంటే ఎక్కువ‌ ట్విస్టులు ఇక్క‌డే ఉంటాయి. అందుకే ఇప్పుడు ర‌జినీని రెచ్చ‌గొట్టే ప‌నిలో ఉన్నాడు ప్ర‌భాస్. దీనివెన‌క కార‌ణం కూడా లేక‌పోలేదు. ర‌జినీ 2.0పై ఇప్పుడు ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ క‌న్నేసి ఉంచింది. అంతేకాదు.. ద‌క్షిణాది ద‌ర్శ‌కుల మ‌ధ్యే ఇప్పుడు కోల్డ్ వార్ న‌డుస్తుంది. మ‌న సౌత్ ను బాలీవుడ్ కు ధీటుగా నిల‌బెట్టిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.. శంక‌ర్. ఇప్ప‌టికే ఈ వార్ లో రాజ‌మౌళి ఓ అడుగు ముందుకేసాడు. బాహుబ‌లితో ఎన్నో మెట్లు ఎక్కేసాడు రాజ‌మౌళి.. అదే స‌మ‌యంలో ఐతో షాక్ ఇచ్చాడు శంక‌ర్. కానీ రాజ‌మౌళి కంటే ముందే టెక్నాల‌జీ.. విజువ‌ల్ ఎఫెక్ట్స్ వాడుకోవ‌డంలో శంక‌ర్ ఆరితేరిపోయాడు. కానీ ఇప్ప‌టి లెక్క‌ల ప‌రంగా చూసుకుంటే ద‌ర్శ‌కధీరుడే కాస్త ముందున్నాడు. దాంతో జ‌క్క‌న్న‌ను కొట్టాలంటే ముందు బాహుబ‌లి 2ను త‌న 2.0తో శంక‌ర్ దాటేయాలి.

బాహుబ‌లి 2 సినిమా 1700 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ చిత్ర రికార్డులు తిర‌గ‌రాయడానికి ఏడాది ప‌డుతుంద‌నుకున్నారంతా. కానీ చైనా సాయంతో దంగ‌ల్ వ‌చ్చి అన్నింటిని కొట్టేసింది. అయితే ఇది ఒరిజిన‌ల్ రికార్డ్స్ కావు. కేవ‌లం ఇండియ‌న్ ప్ల‌స్ ఓవ‌ర్సీస్ క‌లుపుకుంటే వ‌చ్చే వ‌సూళ్లే దీనికి నిద‌ర్శ‌నంగా ఉండాలి. ఆ రికార్డుల్లో ఇప్ప‌టికీ బాహుబ‌లి 2నే నెంబ‌ర్ వ‌న్. దాంతో బాహుబ‌లి 2 రికార్డుల‌పై రోబో క‌న్నేసాడు. ఈ చిత్రాన్ని శంక‌ర్ హాలీవుడ్ రేంజ్ లో తెర‌కెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తై చాలా కాల‌మైనా.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోస‌మే ఏడాదికి పైగా టైమ్ ఇచ్చాడంటే ఎలా ఉండ‌బోతుందో ఊహించుకోవ‌చ్చు. న‌వంబ‌ర్ 29, 2018న విడుద‌ల కానుంది ఈ చిత్రం.
 
2.0 టీజ‌ర్ సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఏకంగా 15 భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు నిర్మాత‌లు. 450 కోట్ల‌తో 2.0 తెర‌కెక్కుతోంది. ప్ర‌మోష‌న్ కోస‌మే 100 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు నిర్మాత‌లు. ఈ చిత్రంలోని సౌండ్ ఎంజాయ్ చేయ‌డానికి ప్ర‌త్యేకంగా చెన్నైలో 4కే టెక్నాల‌జీ సౌండ్ సిస్ట‌మ్స్ తో కొన్ని థియేట‌ర్స్ రెడీ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మెయిన్ ఇండ‌స్ట్రీల్లో ఉన్న డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో ట‌చ్ లో ఉన్నారు 2.0 చిత్ర నిర్మాత‌లు. బాహుబ‌లి 2 కంటే భారీగా.. విజువ‌ల్ ఎఫెక్ట్స్ లో అంత‌కంటే ఉన్న‌తంగా ఉండేలా రోబో 2 ప్లాన్ చేస్తున్నాడు శంక‌ర్. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 2.0 విడుద‌లైన త‌ర్వాత బాహుబ‌లి 2 పేరు వినిపించ‌కూడ‌ద‌నేది శంక‌ర్ భావ‌న‌. ఒక్క చైనాలోనే 15 వేల థియేట‌ర్స్ లో రానున్న 2.0.. మిగిలిన దేశాల్లో క‌లిపి మ‌రో 6000 థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది. మొత్తానికి 2.0 దండ‌యాత్ర 20,000 థియేట‌ర్స్ లో సాగ‌నుంద‌న్న‌మాట‌. మ‌రి నిజంగానే ఇప్పుడు 2.0తో శంక‌ర్ వ‌చ్చి రాజ‌మౌళిని కొడ‌తాడా.. అలా కొడితే అల్టిమేట్ గా ఇండియ‌న్ సినిమా రేంజ్ మ‌రింత పెరుగుతుంది. 

More Related Stories