English   

నిర్మాతల కష్టం తెలుసుకొన్న సుధీర్ బాబు

Sudheer Babu Started Promotions For Nannu Dochukunduvate
2018-09-08 19:59:30

హీరోగా ఉన్న‌పుడు ఎలా ఉన్నాడో తెలియ‌దు కానీ నిర్మాత‌గా మారిన త‌ర్వాత మాత్రం సుధీర్ బాబులో ఏదో తెలియ‌ని జోష్ వ‌చ్చింది. ఈయ‌న ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. న‌న్ను దోచుకుందువ‌టే సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్ లో ఇప్పుడు బిజీ అయిపోయాడు సుధీర్ బాబు. త‌న సొంత ప్రొడ‌క్ష‌న్ లో తొలిసారి నిర్మాత‌గా మారి చేస్తున్న సినిమా ఇది. ఆర్ఎస్ నాయుడు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సాఫ్ట్ వేర్ కామెడీతో ఈ చిత్రం తెర‌కెక్కింది. ముందు సెప్టెంబ‌ర్ 13నే విడుద‌ల చేయాల‌నుకున్నా కూడా అక్కినేని భార్యాభర్త‌లు అదే రోజు రానుండ‌టంతో వారం రోజులు ఆల‌స్యంగా వ‌స్తున్నాడు సుధీర్ బాబు.

పైగా శ‌మంత‌క‌మ‌ణి.. స‌మ్మోహ‌నం అటు ఫ్లాప్ కాదు.. ఇటు హిట్ కాదు.. మంచి సినిమాలుగానే పేరు తీసుకొచ్చాయి. దాంతో ఇప్పుడు ఈ సినిమాపై కూడా అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఇందులో న‌భాన‌టాషా హీరోయిన్ గా న‌టిస్తుంది. ఆమెతో క‌లిసి ప్ర‌మోష‌న్ లో వేగం పెంచేసాడు సుధీర్ బాబు. కాలేజ్ ల‌ను ఎక్కువ‌గా టార్గెట్ చేస్తున్నాడు ఈ హీరో. ఈ మ‌ధ్య చాలా మంది హీరోలు కాలేజీల చుట్టూ తిరిగి త‌మ సినిమా ప్ర‌మోష‌న్ చేసుకున్నారు. ఇప్పుడు సుధీర్ బాబు కూడా ఇదే చేస్తున్నాడు. మొత్తానికి.. ఈ చిత్రంతో సుధీర్ హీరోగా కాకుండా నిర్మాత‌గానూ స‌త్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు.

More Related Stories