English   

దిల్ రాజు సినిమా అయిపోయింది గురూ

Dil Raju's Hello Guru Prema Kosame Shooting Wrapped
2018-09-08 20:38:52

దిల్ రాజు సినిమా అంటే ఒకప్పుడు మాగ్జిమం గ్యారెంటీ. కానీ ఈ మధ్య ఒక్క శ్రీనివాస కళ్యాణంతో ఒక్కసారిగా పడిపోయాడు. ఈ సినిమాతో చాలా విమర్శలు కూడా మూటకట్టుకున్నాడు. నితిన్, రాశిఖన్నా జంటగా వచ్చిన శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు చేస్తోన్న సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ సినిమా అయిపోయింది. అంటే సినిమా ప్రొడక్షన్ వర్క్ అయిపోయిందన్నమాట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసు కదా.. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరో ఫ్లాప్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందుతోన్న ‘‘హలో గురూ ప్రేమకోసమే’’.

లేటెస్ట్ గా ఈ హలో గురూ ప్రేమకోసమే సినిమా షూటింగ్ అయిపోయింది. ఈ విషయం అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. అంటే మిగిలిందిక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. అయితే శ్రీనివాస కళ్యాణం ఎఫెక్ట్ తో ఈ సినిమాకు అవసరమైతే రీ షూట్ కు వెళ్లే అవకాశమూ లేకపోలేదు అంటున్నారు. అటు త్రినాథరావు నక్కిన కూడా గ్రేట్ మేకరేం కాదు.. సాధారణ కథలతో సాధారణ కమర్షియల్ విజయం సాధించగలడంతే. పైగా ఈ సినిమా సెట్స్ లో ఉన్నప్పుడు రచయిత, హీరోకు మధ్య గొడవ జరిగిందనే మాటలూ వినిపించాయి.

ఇక సినిమాను దసరా బరిలో విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. అక్టోబర్ 18న హలో గురూ ప్రేమకోసమే విడుదల కాబోతోంది. అప్పటికి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న అరవింద సమేత వీరరాఘవ కూడా బరిలో ఉంటుంది. మరి ఆ సునామీని తట్టుకుని ఈ సినిమా ఎలా నిలబడుతుందో కానీ.. మొత్తంగా దిల్ రాజు ఈ సినిమాపై చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

More Related Stories