English   

మోత షురూ చేసిన సామి

Keerthy Suresh more Beautiful in Vikram's Saamy Trailer
2018-09-08 21:14:23

తెలుగు, తమిళ ప్రేక్షకుల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మనోళ్లు మాస్ సినిమాలు ఇష్టపడతారు కానీ.. ఊరమాస్ అంటే భరించలేం అంటారు. కానీ తమిళ్ లో ఊరమాస్ అంటేనే ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రెండు తేడాలు తెలుసుకునే తెలుగులో ఈ ‘సామి’ చాలా తగ్గినట్టు తెలుస్తోంది. సామి స్క్వేర్ గా తమిళ్ లో రాబోతోన్న విక్రమ్ సినిమా తెలుగులో సామిగా మాత్రమే ఆగిపోయింది. అంతకు తగ్గట్టుగానే ఆ స్క్వేర్ లో ఉన్న ఓవర్ అండ్ ఊరమాస్ లెక్కలు తగ్గించి ట్రైలర్ విడుదల చేశారు. విక్రమ్ కు ఒకప్పుడు తిరుగులేని మాస్ హిట్ గా నిలిచిన సినిమా సామి. హరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దాదాపు పదిహేనేళ్ల తర్వాత సీక్వెల్ గా వస్తోంది. ఇప్పుడు కూడా హరినే దర్శకుడు. అప్పుడు హీరోయిన్ గా త్రిష నటించింది. ఇప్పుడు కీర్తి సురేష్ తో పాటు ఐశ్వర్య రాజేశ్ కూడా ఉన్నారు. ఇక ఇన్నాళ్ల తర్వాత వస్తోన్న ఈ సీక్వెల్ పైనా తమిళ్ లో మంచి అంచనాలే ఉండటం విశేషం. అంటే సామి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన ట్రైలర్ లో చాలా మార్పులు కనిపించాయి. తమిళ్ సినిమాలో ఓవర్ లౌడ్ అండ్ డోస్ కనిపిస్తాయి. కానీ తెలుగులో కట్ చేశారు. ఇక అన్నిటికీ మించి ఇప్పటి వరకూ పెద్దగా అందాల ప్రదర్శన చేయని కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ ‘థై షో’ చేసింది. కాస్త గ్లామరస్ గా కనిపించింది. పైగా ఈ పాత్ర కూడా మోడరన్ టచ్ తో సాగేదిలా ఉంది. అందుకు తగ్గట్టుగానే అమ్మడు కాస్త ‘డోస్’ పెంచింది. అటు ఐశ్వర్య రాజేశ్ కూడా ఇప్పటి వరకూ ఎక్కువగా విలేజ్ గాళ్ గానే కనిపించేది. ఫస్ట్ టైమ్ ఓ పెద్ద హీరో సినిమాలో మోడర్న్ గా ఉంది. మొత్తంగా సెప్టెంబర్ విడుదల అని ట్రైలర్ లో వేశారు. అంటే ఈ నెల 21 లేదా లాస్ట్ వీక్ మాత్రమే వీరికి ఛాన్సుంది. ఏదేమైనా ఈ సామి ట్రైలర్ లో కీర్తి సురేష్ అందాల మోతే హైలెట్ కావడం విశేషం.

More Related Stories