English   

హోటల్ లో వంట చేసే వ్యక్తి స్టార్ హీరో అయ్యాడు

Akshay Kumar Turns 51 Happy Birthday Bollywood's Gold Akshay Kumar
2018-09-09 08:26:04

అనుకోకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు.. హోట‌ల్ లో ప‌నిచేసుకునే కుక్ నుంచి ఇప్పుడు ఇండియ‌న్ బాక్సాఫీస్ ను షేక్ చేసే స్టార్ వ‌ర‌కు ఎదిగాడు. యాక్ష‌న్ సినిమాల నుంచి అన్ని తాను చేయ‌గ‌ల‌ను అని నిరూపించుకుని.. నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకునేంత ఎత్తుకు చేరిపోయాడు. ఆయ‌నే వ‌న్ అండ్ ఓన్లీ అక్ష‌య్ కుమార్. బాలీవుడ్ బాక్సాఫీస్ బంగారం ఈయ‌న‌. బంగారం అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుర్తొస్తాడు. టాలీవుడ్ కు ఆయ‌నే బంగారం. సినిమా యావ‌రేజ్ గా ఆడినా.. బంగారం అంటే ప‌వ‌ర్ స్టార్ పేరు గుర్తుకు వ‌స్తుంది. బాలీవుడ్ లో బంగారం అక్ష‌య్ కుమారే. ఆయ‌న న‌టిస్తున్న సినిమాలు కూడా అలా ఉన్నాయి మ‌రి. సెప్టెంబ‌ర్ 9 ఆయ‌న పుట్టిన‌రోజు. ఇన్నేళ్ల కెరీర్ లో 150 సినిమాల‌కు పైగానే న‌టించాడు అక్ష‌య్ కుమార్. చిన్న హీరోగా మొద‌లై.. కామెడీ సినిమాలు చేసుకుంటూ.. స‌పోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ.. ఇప్పుడు సూప‌ర్ స్టార్ ఆఫ్ ఇండియ‌న్ సినిమాగా చ‌క్రం తిప్పుతున్నాడు అక్ష‌య్ కుమార్.

ఇప్ప‌టికీ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ ర‌ప్ఫాడిస్తున్నాడు. సినిమాల‌ వ‌ర‌కే కాదు.. నిజంగా కూడా ఆయ‌న గోల్డే. సాయం చేయ‌డం లో అక్ష‌య్ ను మించిన వాళ్లు లేరు బాలీవుడ్ లో. వీధి బాల‌ల‌కు కూడా సాయం చేసే మ‌న‌స్త‌త్వం అక్ష‌య్ కుమార్ ది. బాలీవుడ్ లో ఎంత మంది సూప‌ర్ హీరోలైనా ఉండొచ్చు కానీ అక్ష‌య్ కుమార్ మాత్రం డిఫెరెంట్. ఏడాదికి ఈయ‌న నాలుగు సినిమాలు చేస్తాడు. అందులో క‌నీసం రెండైనా సూప‌ర్ హిట్ అవుతుంటాయి. కానీ రెండేళ్లుగా ఈయ‌న చేస్తోన్న ప్ర‌తీ సినిమా సూప‌ర్ హిట్ అవుతుంది. అంతెందుకు గ‌తేడాది అక్ష‌య్ కుమార్ నుంచి వ‌చ్చిన జాలీ ఎల్ఎల్ బీ 2.. టాయ్ లెట్ మంచి విజ‌యాలు సాధించాయి. ప్ర‌తీ ఇంట్లో ఓ బాత్రూమ్ ఉండాలి.. ఆడ‌వాళ్ల‌ను గౌర‌వించాలి.. అని చెప్పే క‌థ ఇది. ఈ ఏడాది ప్యాడ్ మ్యాన్ అనే మ‌రో డిఫెరెంట్ సినిమాతో వ‌చ్చాడు. గోల్డ్ కూడా భిన్న‌మైన సినిమానే. ప్ర‌స్తుతం ర‌జినీకాంత్ 2.0లో విల‌న్ గా న‌టిస్తున్నాడు అక్ష‌య్ కుమార్. ఈయ‌న ఇలాంటి పుట్టిన‌రోజులు మ‌రెన్నో జరుపుకోవాల‌ని ఆశిద్ధాం.

More Related Stories