English   

అరవింద సమేతుడి నుంచి అదిరిపోయే అప్డేట్

NTR's Aravinda Sametha Exclusive Updates
2018-09-09 08:56:29

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కో గుడ్ న్యూస్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తోన్న అరవింద సమేత వీరరాఘవ సినిమాకు సంబంధించి సిసలైన అప్డేట్ వచ్చేసింది. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు. హారిక హాసిని బ్యానర్ లో రూపొందుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం యంగ్ టైగర్ తండ్రి మరణించిన బాధను కూడా దిగమింగుకుని నాలుగో రోజు నుంచే షూటింగ్ లో పాల్గొన్నాడు. సినిమాపై తనకున్న కమిట్మెంట్, ప్యాషన్ ను నిర్మాతలు నష్టపోకూడదనే తన అభిమతాన్ని ఈ విధంగా ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి భారీగా ఎక్స్ పెక్ట్ చేస్తోన్న ఆడియన్స్ కు వారి ఎక్స్ పెక్టేషన్స్ ను డబుల్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. మొత్తంగా అక్టోబర్ 11న దసరా బరిలో విడుదల కాబోతోన్న ఈ మూవీ ఆడియో రిలీజ్ డేట్ వచ్చేసింది.

అరవింద సమేత వీరరాఘవలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటించారు. సునిల్ ఈ మూవీతో కమెడియన్ గా తిరిగి తన సత్తా నిరూపించుకోబోతున్నాడు. అయితే కమెడియన్ గానే కాక అతని పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందంటున్నారు. ఇక జగపతిబాబు, రావు రమేష్, రవికిషన్, నాగబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాకు తొలిసారిగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ ఆడియోను ఈ నెల 20న విడుదల చేయబోతున్నారు. ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఆడియో తర్వాత అక్టోబర్ ఫస్ట్ వీక్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించేలా ప్లానింగ్ పూర్తయిందని సమాచారం. మొత్తంగా అభిమానుల్లో దసరా సంబరాలను నెల రోజులు ముందుగానే ప్రారంభించబోతున్నాడు యంగ్ టైగర్.

More Related Stories