English   

ప‌వ‌న్ చెప్పాడు.. విజ‌య్ దేవరకొండ ఫాలో అయ్యాడు

Vijay Devarakonda Followed Pawan Kalyan's Punch Dialogue
2018-09-09 09:36:08

నేను ట్రెండ్ ఫాలో అవ్వ‌ను.. ట్రెండ్ సెట్ చేస్తానంటూ గ‌బ్బ‌ర్ సింగ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పిన డైలాగులు ఆయ‌న పాటించాడో లేదో కానీ ఇప్పుడు విజ‌య్ దేర‌వ‌కొండ మాత్రం ప‌క్కాగా ఫాలో అవుతున్నాడు. ఈయన సినిమా సినిమాకు పిచ్చెక్కించేలా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ముఖ్యంగా క‌థ‌ల ఎంపిక‌లో ఈ త‌రం హీరోలెవ‌రికీ లేని మెచ్యూరిటీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌లో క‌నిపిస్తుంది. యూనివ‌ర్స‌ల్ అప్పీల్ ఉన్న క‌థ‌ల వైపు అడుగేస్తున్నాడు ఈ కుర్ర హీరో. పెళ్లిచూపులులో ఆవారా కుర్రాడు.. అర్జున్ రెడ్డిలో ఆర‌గెంట్ రోల్.. గీత‌గోవిందంలో ప‌క్కింటి అబ్బాయిగా సంస్కార‌వంత‌మైన ల‌వ‌ర్ బాయ్ ఇలా ఒక్కో సినిమాలో ఒక్కోలా మారిపోతున్నాడు. అస‌లు ఈయ‌న క‌థ‌ల ఎంపిక చూస్తుంటేనే మైండ్ గిర్రున తిరిగిపోతుంది. ఇప్పుడు నోటాలో రాజ‌కీయ నాయ‌కుడిగా ర‌చ్చ చేస్తున్నాడు విజ‌య్.

నోటాలో విజ‌య్ పాత్ర ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయింది. ఇక్క‌డ ఇండ‌స్ట్రీ అంటే ఒక్క‌టి కాదు.. త‌మిళ‌నాట కూడా ఇదే టాపిక్ ఇప్పుడు. ఘాటుగా రెండు మూడు బూతులు కూడా వాడేసి తాను ఇంకా మార‌లేద‌ని నిరూపించుకున్నాడు విజ‌య్. ఆనంద్ శంక‌ర్ ఈ పాత్ర‌కు ఏం చూసి విజ‌య్ ను ఎంచుకున్నాడో తెలియ‌దు కానీ ఆయ‌న న‌మ్మ‌కాన్ని మాత్రం 100 శాతం కాదు.. 200 శాతం నిల‌బెట్టాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడే ఇలా ఉంటే రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత ఎలా ఉండ‌బోతుందో..? ఇటు తెలుగులో, అటు తమిళ్ లోనూ నోటా సంచ‌ల‌నం సృష్టించేలా క‌నిపిస్తుంది. ఈ దెబ్బ‌తో త‌మిళ‌నాట కూడా త‌న జెండా పాత‌డానికి ఫిక్సైపోతున్నాడు విజ‌య్. రాజ‌కీయాల్లో ఓన‌మాలు కూడా రావంటూనే రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌లో ర‌ప్ఫాడిస్తున్నాడు విజ‌య్. మొత్తానికి అప్పుడు ప‌వ‌న్ ట్రెండ్ గురించి మాట‌లు మాత్ర‌మే చెప్పాడు. ఇప్పుడు విజ‌య్ దాన్ని చేసి చూపిస్తున్నాడు.

More Related Stories