English   

దిల్ రాజుని బ‌తికించిన రామ్.. 

Ram-Dilraju
2018-09-09 10:50:12

అనుకున్న‌ది సాధించాల‌నే త‌ప‌న ఉంటే క‌చ్చితంగా అది అవుతుంది. క‌నీసం ప్ర‌య‌త్నం కూడా చేయ‌కుండా.. గాల్లో దీపం పెట్టి కూర్చుంటే ఎలా..? మ‌న‌ వంతు ప్ర‌య‌త్నం చేసాకే క‌దా దేవుడు కూడా క‌రుణిస్తాడు. ఇప్పుడు దిల్ రాజు ఇదే చేసాడు. దేవుడు కూడా క‌రుణించాడు. 2017లో ఈయ‌న ఆరు సినిమాలు వ‌స్తే అన్నీ బాగానే ఆడాయి. దాంతో తానేం క‌థ ఓకే చేసినా సూప‌ర్ హిట్టే అని ఫిక్స్ అయిపోయాడు దిల్ రాజు. 2018లో మబ్బులు విడిపోడానికి పెద్ద‌గా టైమ్ ప‌ట్ట‌లేదు. ముందు ల‌వ‌ర్.. ఆ త‌ర్వాత శ్రీ‌నివాస క‌ళ్యాణంతో రాజుగారికి కోలుకోలేని షాకిచ్చాయి. ఇక ఇప్పుడు ఈయ‌న హ‌లోగురు ప్రేమ‌కోస‌మేతో వ‌స్తున్నాడు. ఈ చిత్ర హీరో రామ్.. సినిమా యూనిట్ కు మ‌ధ్య వార్ జ‌రిగి షూటింగ్ ఆల‌స్యం అవుతుంద‌నే వార్త‌లు వ‌చ్చినా కూడా త‌నే ద‌గ్గ‌రుండి అన్నీ సెట్ చేసాడు దిల్ రాజు. అనుకున్న టైమ్ కు సినిమా వ‌స్తుందా రాదా అనే టెన్ష‌న్ న‌డుస్తున్న టైమ్ లో అక్టోబ‌ర్ 18నే రావ‌డం ఖాయం అని మ‌రోసారి క‌న్ఫ‌ర్మ్ చేసాడు రాజు. ఈ సినిమా ఔట్ పుట్ కూడా తానే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాడు దిల్ రాజు. తాజాగా ఈ చిత్ర టాకీ పార్ట్ కూడా పూర్తైపోయింది. రీ షూట్ కూడా చేసి మ‌రీ అంతా సిద్ధం చేసి ఉంచాడు ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావ్ న‌క్కిన‌. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ఫ్లాప్ త‌ర్వాత కూడా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తో మ‌రోసారి జోడీ క‌ట్టాడు రామ్. ప్ర‌ణీత రెండేళ్ల త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది. ఏదేమైనా ఈ సినిమా అనుకున్న టైమ్ కు పూర్తి కావ‌డంతో గాల్లో తేలిపోతున్నాడు దిల్ రాజు. మ‌రి రేపు హిట్ కూడా అయిందంటే రాజుగారి గోల్డెన్ టైమ్ మ‌ళ్లీ బ్యాక్ అయిన‌ట్లే..!

More Related Stories