English   

కేరాప్ కంచరపాలెం పై మహేష్ బాబు కమెంట్స్ 

Mahesh-Babu
2018-09-09 13:26:57

ఈ మధ్య మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఎన్నో విషయాలపై వెంటనే రియాక్ట్ అవుతున్నాడు. ఇక తన మనసుకు నచ్చిన విషయాలైతే వెంటనే షేర్ చేసుకుంటున్నాడు. అలాగే ఈ మధ్య వేరేవారి సినిమాల గురించి కూడా బాగా మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ తో వహ్వా అనిపించుకున్న కేరాఫ్ కంచరపాలెం సినిమా గురించి మహేష్ బాబు ట్వీట్ చేశాడు. సినిమా అద్భుతం అన్న విషయాన్ని తనదైన శైలిలో చెప్పాడు. ‘క్లాస్ లా ఉన్న మాస్. ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. ప్రతి పాత్రనూ అద్భుతంగా రాసుకున్నారు. క్లైమాక్స్ ఈ సినిమాకు గుండెలాంటిది.  ఫస్ట్ మూవీతోనే అద్భుతం అనిపించుకున్న దర్శకుడు వెంకటేష్ మహాకు కంగ్రాట్స్. నాకు బాగా నచ్చింది’ అంటూ మహేష్ బాబు చేసిన ట్వీట్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ కానుందని చెప్పొచ్చు. నిజమే చాలాసార్లు సెలబ్రిటీస్ సాధారణ కమర్షియల్ హిట్స్ కు ఎక్కువగా రియాక్ట్ కావడం లేదు. జెన్యూన్ హిట్స్ విషయంలోనే రియాక్ట్ అవుతున్నారు. అలాగే మహేష్ బాబు కూడా గతంలో వచ్చిన అర్జున్ రెడ్డి నుంచి ఈ కంచరపాలెం వరకూ వైవిధ్యమైన సినిమాల గురించే ఎక్కువగా ట్వీట్స్ చేశాడు. మొత్తంగా కేరాఫ్ కంచరపాలెం ప్రివ్యూస్ లోనే కాదు.. థియేటర్స్ లోనూ దుమ్మురేపుతోందిప్పుడు. 

More Related Stories