English   

త్రివిక్ర‌మ్ తో వెంక‌టేశ్.. వామ్మో సీరియ‌స్సా..?

Venkatesh-Trivikram
2018-09-09 16:46:49

వెంక‌టేశ్-త్రివిక్ర‌మ్.. ఈ కాంబినేష‌న్ అంటేనే అదోర‌కం ఆస‌క్తి. ఈ రోజు త్రివిక్ర‌మ్ ఇండ‌స్ట్రీలో ఈ స్థాయి అనుభ‌విస్తున్నాడంటే దానికి కార‌ణం వెంక‌టేశ్. అప్ప‌ట్లో ఆయ‌న‌తో చేసిన సినిమాలు సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయి. ద‌ర్శ‌కుడిగా మారిన త‌ర్వాత వెంక‌టేశ్ తో త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌లేదు కానీ అంత‌కుముందు మ‌ల్లీశ్వ‌రి, నువ్వు నాకు న‌చ్చావ్, వాసు సినిమాల‌కు క‌లిసి ప‌నిచేసారు ఈ జోడీ. ర‌చ‌యిత‌గా త్రివిక్ర‌మ్ కు నందులు కూడా వెంకీ సినిమాల‌తో వ‌చ్చాయి. అలాంటి కాంబినేష‌న్ ఇది. అయితే ద‌ర్శ‌కుడు అయిన త‌ర్వాత ఎందుకో కానీ ఈ హీరోతో ప‌నిచేసే అవ‌కాశ‌మే రాలేదు త్రివిక్ర‌మ్ కు. ఈయ‌న ఎక్కువ‌గా ఈ త‌రం హీరోల‌పై దృష్టి పెట్ట‌డంతో ఎప్పుడూ వెంకీ వైపు చూడ‌లేదు ఈ మాట‌ల మాంత్రికుడు. ప‌వ‌న్, మ‌హేశ్, బ‌న్నీ లాంటి స్టార్స్ కే త్రివిక్ర‌మ్ అంకితం అయిపోవ‌డంతో ఇత‌ర హీరోల‌కు చాన్స్ రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే త్రివిక్ర‌మ్ రూట్ మారుస్తున్నాడు. ఇప్పుడు కెరీర్ లో తొలిసారి ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. అర‌వింద స‌మేత షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఆ వెంట‌నే వెంక‌టేశ్ సినిమా ఉంటుంది. ఆ మ‌ధ్య వెంకీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త్రివిక్ర‌మ్ తో సినిమాను అనౌన్స్ చేసాడు నిర్మాత రాధాకృష్ణ‌. కానీ ఉంటుందా ఉండ‌దా అనే అనుమానం అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఉంద‌నే క్లారిటీ వ‌చ్చింది. వెంక‌టేశ్ తో లో బ‌డ్జెట్ లో సినిమా చేసి ఎక్కువ లాభాలు ఆర్జించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్ర‌మ్. ఎలాగూ త్రివిక్ర‌మ్-వెంకీ అంటే క‌నీసం 40 కోట్ల మార్కెట్ వ‌ర్క‌వుట్ అవుతుంది. చూడాలి ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో ఇక‌..!

More Related Stories