English   

అనూప్ ను బ‌య‌టికి పంపిన అల్లుఅర్జున్

Allu Arjun Changed Anup Rubens For Vikram K Kumar Movie
2018-09-09 18:36:57

అనూప్ రూబెన్స్ తో అస‌లు బ‌న్నీకి ఏంటి సంబంధం..? ఈ ఇద్ద‌రూ క‌నీసం ఎప్పుడు క‌లిసి కూడా ప‌ని చేయ‌లేదు క‌దా అనుకుంటున్నారా..? క‌రెక్టే కానీ ప‌ని చేయాల్సి వ‌స్తుందేమో అని ముందే జాగ్ర‌త్త ప‌డ్డాడు అల్లుఅర్జున్. ఈయ‌న త్వ‌ర‌లోనే విక్ర‌మ్ కే కుమార్ తో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు ముందు అనూప్ రూబెన్స్ ను సంగీత ద‌ర్శ‌కుడిగా అనుకున్నారు. ఎందుకంటే విక్ర‌మ్ కు ఈయ‌న ఆస్థాన సంగీత ద‌ర్శ‌కుడు. పైగా క‌లిసి వ‌చ్చాడు కూడా. ఇష్క్.. మ‌నం.. హ‌లో సినిమాల‌కు క‌లిసి ప‌నిచేసారు అనూప్-విక్ర‌మ్. ఈ జోడీ సూప‌ర్ హిట్ కూడా. పాట‌లు అన్నీ బాగానే హిట్ అయ్యాయి. అయినా కూడా ఇప్పుడు విక్ర‌మ్ నుంచి అనూప్ ను విడ‌గొట్టేసాడు బ‌న్నీ. మ‌ధ్య‌లో సూర్య ఒక్క‌సారి 24 కోసం ఏఆర్ రెహ‌మాన్ ను ప‌ట్టుకొచ్చాడు.. ఇప్పుడు బ‌న్నీ కూడా ఇదే చేసాడు.

అయితే ఈయ‌న రెహ‌మాన్ ను కాకుండా జివి ప్ర‌కాశ్ కుమార్ ను తీసుకొస్తున్నాడు. ఈయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తూ బిజీగా ఉన్నాడు అయినా కూడా అల్లుఅర్జున్ కోసం వాయించ‌డానికి రెడీ అవుతున్నాడు. విక్ర‌మ్ కే కుమార్ తో బ‌న్నీ సినిమా క‌న్ఫ‌ర్మ్ అయింది. ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌నాట కూడా ఒకేసారి తెర‌కెక్కుతుంది. భారీ బ‌డ్జెట్ తో అల్లు అర‌విందే ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఇది కూడా భిన్న‌మైన క‌థ‌తోనే రానుంది. విక్ర‌మ్ ఎలాగూ రొటీన్ క‌థ‌లు చేయ‌డు. ఈయ‌న సినిమాల‌న్నీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ర‌న్ అవుతుంటాయి. ఇప్పుడు బ‌న్నీ సినిమా కూడా అంతే. ఈ సినిమా న‌వంబ‌ర్ లో ప‌ట్టాలెక్క‌బోతుంది. హీరోయిన్ తో పాటు మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి. మొత్తానికి ఏదేమైనా విక్ర‌మ్-అనూప్ జోడీని మాత్రం విడ‌గొట్టేసాడు అల్లు వార‌బ్బాయి.

More Related Stories