English   

ప్రభాస్ బిజినెస్ వందల కోట్లు

Prabhas Upcoming Movies Budget Hundreds of Crores
2018-09-09 20:51:13

ప్రభాస్ సినిమాలు బడ్జెట్ విషయంలో అన్ లిమిటెడ్ గా వెళుతున్నాడనే వార్తలు టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన చేస్తోన్న రెండు సినిమాల బడ్జెట్ చూస్తే ఖచ్చితంగా ఈ బడ్జెట్ తో మీడియం రేంజ్ సినిమాలు ఓ పది పదిహేను వరకూ తీసేయొచ్చు. ఆ స్తాయిలో ఖర్చు పెట్టిస్తున్నారు మరి. సరే వాటి రిజల్ట్ గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం తొందర అవుతుంది కానీ.. ముందుగా వస్తోన్న సాహో బడ్జెట్ ఇప్పటికే 150 నుంచి 200ల కోట్ల వరకూ వెళ్లిపోయిందనుకోవచ్చు. ఇందుకు కొత్త దర్శకుడి అవగాహనా లోపం ఒక కారణం అయితే మూడు భాషల్లో విడుదలవుతోంది.. అలాగే కాస్టింగ్ భారీగా ఉండటం.. వాళ్లందరి డేట్స్ అడ్జెస్ట్ కావడం కష్టం కాబట్టి బడ్జెట్ మరింత పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ప్రభాస్ చేస్తోన్న రెండో సినిమాకూ ఇంతే బడ్జెట్ అవుతుందని సమాచారం.

జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో మరో కొత్త సినిమా ఓపెన్ చేశాడు ప్రభాస్. ఇది 1970-80ల మధ్య కాలంలో సాగే ప్రేమకథగా చెప్పుకున్నారు. అంతేకాక ఆ కాలంలో యూరప్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథట. అంటే సెట్ వర్క్స్, ఆర్ట్ వర్క్ కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. దీంతో బడ్జెట్ సాధారణంగానే ఉంటుందని అంచనా వేశారు. కానీ ప్రభాస్ మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాను కూడా భారీగా తీయాలని చెప్పాడట. పైగా ఇది వారి సొంత బ్యానర్ గోపీకృష్ణాలో రూపొందుతోంది. కాబట్టి ‘రాజు’ తలచుకుంటే బడ్జెట్ కు కొదవా. అందుకే ఈ సినిమా బడ్జెట్ కూడా ఏకంగా 150కోట్లు అని చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీకి మగధీర, ఈగ వంటి సినిమాలతో జాతీయ అవార్డులు అందుకున్న రవీందర్ ఆధ్వర్యంలో ఆర్ట్ వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ ఓడ, విమానం...వంటి సెట్స్ వేస్తున్నారట. మొత్తంగా ఈ మూవీ బడ్జెట్ తో ప్రభాస్ పై ఇండస్ట్రీ వర్గాల నుంచి కాస్త సెటైర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిని అతనెలా రిసీవ్ చేసుకుంటాడో కానీ.. బడ్జెట్ తో పాటు కంటెంట్ విషయంలోనూ ఇంతే రిచ్ గా ఉంటే మాత్రం అతను తన డబ్బులు రికవర్ చేసుకోవడం పెద్ద మేటరేం కాదు.. కానీ ఎటొచ్చీ.. కేవలం ఒక సినిమా వయస్సు మాత్రమే ఉన్న దర్శకులను నమ్మి అంత పెద్ద రిస్క్ చేయడమే చాలామంది అర్థం కావడం లేదు.

More Related Stories