English   

రానా నువ్వు తోపు : మహేష్

Mahesh Babu Praises Rana Daggubati
2018-09-09 21:56:48

రానా ఇప్పుడు న‌టుడు మాత్ర‌మే కాదు.. నిర్మాత కూడా. ఈయ‌న‌లో లేని కోణం అంటూ లేదు. న‌టుడిగా అన్ని పాత్ర‌లు చేసే రానా ద‌గ్గుపాటి.. నిజ జీవితంలోనూ అన్ని యాంగిల్స్ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈయ‌న క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం కూడా ద‌క్కింది. ఈయ‌న విడుద‌ల చేసిన కేరాఫ్ కంచ‌ర‌పాలెం సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీ అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. కొత్త ద‌ర్శ‌కుడైనా కూడా వెంక‌టేష్ మ‌హా ఈ చిత్రాన్ని అద్బుతంగా తెర‌కెక్కించాడ‌ని అంతా చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు రానాకు మహేష్ బాబు కూడా అభినంద‌న‌లు తెలిపాడు.

ఈయ‌న కూడా కేరాఫ్ కంచ‌ర‌పాలెం సినిమా చూసాడు. చూసి ఫిదా అయ్యాడు.. అయిన త‌ర్వాత ఊరికే ఎలా ఉంటాడు.. అందుకే ట్విట్ట‌ర్ లో ఈ సినిమా గురించి పోస్ట్ పెట్టాడు. మ‌న‌సును క‌దిలించిన సినిమా.. చాలా రోజుల త‌ర్వాత చూసిన అద్భుత‌మైన సినిమా అంటూ ప్ర‌శంసించాడు. రానాను కూడా పొగుడుతూ ఇలాంటి సినిమాలు ఎంక‌రేజ్ చేస్తున్నందుకు నిజంగా నిన్ను చూస్తుంటే గ‌ర్వంగా ఉంది రానా అంటూ ట్వీట్ చేసాడు. ఈ మ‌ధ్య చిన్న సినిమాల‌ను బాగానే పొగుడుతున్నాడు మహేష్. స‌మ్మోహ‌నం.. గూఢ‌చారి.. గీత‌గోవిందం.. ఇలా ఈ మ‌ధ్య చాలా సినిమాల‌కు త‌న విషెస్ అందించాడు సూప‌ర్ స్టార్.

More Related Stories