English   

కళ్యాణ్ కు నాగార్జునే దిక్కు

Director Kalyan Krishna Don't Have Option Except Nagarjuna
2018-09-10 06:26:08

క‌ళ్యాణ్ అంటే కొంప‌దీసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయితే కాదుక‌దా అనుకుంటున్నారా..? ఖచ్చితంగా కాదు.. అయినా ఇప్పుడు ప‌వ‌న్ కళ్యాణ్ కు సినిమాల గురించి ఆలోచించే టైమ్ ఎక్క‌డుంది..? ఇక్క‌డ క‌ళ్యాణ్ అంటే క‌ళ్యాణ్ కృష్ణ‌.. సోగ్గాడే చిన్నినాయ‌నా సినిమాతో నాగార్జున కెరీర్ లోనే తొలి 50 కోట్ల సినిమా ఇచ్చాడు క‌ళ్యాణ్ కృష్ణ‌. అక్కినేని కంపౌండ్ లోనే రెండేళ్ల‌కు పైగా ఉండి రెండు హిట్లు ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. సోగ్గాడేతో పాటు చైతూ హీరోగా వ‌చ్చిన రారండోయ్ వేడుక చూద్దాం కూడా బాగానే ఆడింది. అయితే అక్కినేని కంపౌండ్ వ‌దిలేసి నేల‌టికెట్ అంటూ ర‌వితేజ‌ను చేరి లేనిపోని డిజాస్ట‌ర్ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు మ‌ళ్లీ మొద‌ట్నుంచీ లెక్క పెడుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

ప్ర‌స్తుతం ఈయ‌న నాగార్జున‌తోనే సినిమాకు సిద్ధం అవుతున్నాడు. సోగ్గాడే చిన్నినాయ‌నాకు ప్రిక్వెల్ గా ఓ క‌థ రాసుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. దీనికి నాగార్జున బంగార్రాజు అనే టైటిల్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఇప్ప‌టికే ఓ సారి క‌థ చెప్పినా కూడా నాగ్ కు న‌చ్చ‌లేదు.. దాంతో ఇప్పుడు సీనియ‌ర్ రైట‌ర్ స‌త్యానంద్ సహాయంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ రెడీ చేసాడు. ఇప్పుడు క‌ళ్యాణ్ కు కూడా మ‌రో ఆప్ష‌న్ లేదు. నాగార్జున ఆఫ‌ర్ ఇస్తే కానీ ఈయ‌న ఉనికిని చాటుకోలేడు. లేదంటే సింగిల్ మూవీ వండ‌ర్ గా మిగిలిపోవాల్సిందే. అందుకే క‌ష్ట‌ప‌డుతున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే ఇప్పుడు క‌ళ్యాణ్ బంతి నాగార్జున కోర్టులో ఉంద‌న్న‌మాట‌.

More Related Stories