English   

భర్త కాళ్ళ దగ్గర చోటు సంపాదించుకొన్న ప్రియాంక

Nick Jonas Opened up Love Story With Priyanka Chopra
2018-09-10 08:12:13

ప‌తియే ప్ర‌త్య‌క్ష దైవం.. ఇదే భార‌తీయ మ‌హిళ‌ల సూత్రం. ఎంత‌పెద్ద స్థానంలో ఉన్నా.. ఎవ‌రెంత తోపు అయినా కూడా ఒక్క‌సారి పెళ్లైన త‌ర్వాత ఆ సెంటిమెంట్ మ‌రోలా ఉంటుంది. ఎందుకో తెలియ‌దు కానీ ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్  అయిపోతుంటారు అమ్మాయిలు. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా దీనికి మిన‌హాయింపు కాదు. ఈమె కూడా త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతుంది. కోరుకున్న ప్రియుడు నిక్ జోనస్ తోనే ఏడ‌డుగులు వేస్తుంది ఈ భామ‌. ఎంగేజ్ మెంట్ ముందు వ‌రకు కూడా ఎలా ప‌డితే అలా ఉన్నా కూడా నిశ్చితార్థం నుంచి మాత్రం ప‌క్కా ఇండియ‌న్ అమ్మాయిగా మారింది ప్రియాంక‌. అప్ప‌ట్నుంచీ అన్నీ భార‌తీయ సంప్ర‌దాయం ప్ర‌కార‌మే జ‌రుపుకుంటుంది. నిశ్చితార్థం కూడా చాలా ప‌ద్ద‌తిగా చేసుకుంది ప్రియాంక‌. ఇక ఇప్పుడు కాబోయే భ‌ర్త కాళ్ల ద‌గ్గ‌ర కూర్చుంది.

భ‌ర్తపై గౌర‌వం పెరిగిపోయింది ఈ భామ‌కు. అందుకే నిక్ కాళ్ల ద‌గ్గ‌ర కూర్చుని పోజ్ ఇచ్చింది పిగ్గీ చోప్స్. అయితే అస‌లు వీళ్లిద్ద‌రి ప‌రిచ‌యం మొద‌లైన తీరు మాత్రం న‌వ్వు తెప్పించ‌క మాన‌దు. నిక్ తో ప్రియాంక‌కు ప‌రిచ‌యం చాలా వింత‌గా జ‌రిగింది. 2017 గాలా రెడ్ కార్పెట్ ద‌గ్గ‌రే ఈ ఇద్ద‌రూ తొలిసారి క‌లిసారు.. అక్క‌డే జంటగా మెరిశారు. ఆ సందర్భంగా ఒకరోజు డేట్ కు వెళ్లారు. అస‌లు అప్ప‌టి వ‌ర‌కు తెలియ‌ని వ్య‌క్తితో.. అందులోనూ త‌న‌కంటే వ‌య‌సులో ప‌దేళ్లు చిన్న‌వాడైన నిక్ జోన‌స్ తో డేటింగ్ కు ఎందుకు వెళ్లిందో తెలుసా.. ఇద్ద‌రూ ఒకే క‌ల‌ర్ డ్ర‌స్ వేసుకున్నార‌ని. ఇది విన్న త‌ర్వాత అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ త‌ర్వాత ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకున్నారు.. ఇప్పుడు ఒక‌రితో ఒక‌రు జీవితం పంచుకోడానికి సిద్ధ‌మైపోయారు. మొత్తానికి ప్రియాంక చోప్రా, నిక్ ల పెళ్లి ఇప్పుడు ఇండియ‌న్ కాదు.. వ‌ర‌ల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది. ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ ఇద్ద‌రూ వ‌చ్చే ఏడాది పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు.

More Related Stories