English   

పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోరుకు సిద్ధం అయ్యాడా..?

Pawan Kalyan's Janasena Party Stamina in Telangana
2018-09-10 08:22:48

ప‌దేళ్ల కింద అన్న‌య్య చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి అప్ప‌ట్లో అనుభవం లేక అన్నీ ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేసుకుంటూ వెళ్లిపోయాడు. దానికి తోడు ప‌క్కన కొంద‌రు చేరి మెగాస్టార్ ను ఎటూ కాకుండా చేసారు. మ‌రీ మూడేళ్లు కూడా పార్టీని న‌డ‌ప‌కుండా కాంగ్రెస్ లో క‌లిపేసాడు చిరు. ఇక ఇప్పుడు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం మొండిగా ముందుకెళ్తున్నాడు. జ‌న‌సేన వ‌చ్చి ఇప్ప‌టికే నాలుగేళ్లైంది. ప్ర‌జ‌ల కోసం పోరాటం చేస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పోటీ చేయ‌లేదు. ఇప్పుడు అది కూడా చేస్తున్నాడు. 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో 175 స్థానాల‌కు పోటీ చేస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇదివ‌ర‌కు అడిగితే ఎక్క‌డ బ‌లం ఉందో అక్క‌డ మాత్ర‌మే చేస్తానన్నాడు ప‌వ‌న్. కానీ ఇప్పుడేమో అన్ని చోట్లా చేస్తానంటున్నాడు. ఏపీలో ప‌రిస్థితి ఎలా ఉన్నా తెలంగాణ‌లో మాత్రం ప‌వ‌న్ అస్స‌లు పోటీ చేయ‌డు.. ఇక్క‌డ క‌నీసం ఎవ‌రికీ మ‌ద్ద‌తు కూడా ఇవ్వ‌డ‌ని అంతా అనుకున్నారు. ఇక్క‌డ కేవ‌లం చుట్ట‌పు చూపుగానే జ‌న‌సేన ఉంటుంద‌ని ఇన్నాళ్లూ అంచ‌నా వేసారంతా. కానీ ఇప్పుడు స‌డ‌న్ గా తెలంగాణ‌లో కూడా జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని చెప్పాడు ప‌వ‌ర్ స్టార్.

అస‌లు ఇక్క‌డ ఈయ‌న‌కు ఎవ‌రు ఓటేస్తారు.. క‌నీసం క్యాడ‌ర్ కూడా లేకుండా ఎలా పోటీ చేస్తాడ‌నే వాద‌న ఇప్పుడు వినిపిస్తుంది. ఎప్పుడో జ‌నం మ‌రిచిపోయిన లెఫ్ట్ పార్టీల‌తో క‌లిసి ప‌వ‌న్ తెలంగాణ‌లో పోటీ చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ దిశ‌గా ఆ పార్టీ నేత‌ల‌తో ప‌వ‌న్ సంప్ర‌దింపులు కూడా జ‌రిపాడు. అయితే అస‌లు సెకండ్ గ్రేడ్ లీడ‌ర్ లేని జ‌న‌సేన‌.. క్యాడ‌ర్ ఎంతుందో కూడా తెలియ‌ని జ‌న‌సేన‌ను ప్ర‌జ‌లు న‌మ్ముతారా..? ప‌వ‌న్ ఒక్క‌డే ఈ పార్టీని జ‌నాల్లోకి తీసుకెళ్లి విజ‌యం సాధిస్తాడా అనేది ఆస‌క్తి క‌లిగించే అంశం. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లుపెట్టినా ఇంకో 8 నెల‌ల్లోనే వ‌చ్చేస్తాయి ఎల‌క్ష‌న్స్. తెలంగాణ‌లో ముంద‌స్తు కాబ‌ట్టి మూడు నెల‌లు కూడా లేవు. పైగా పార్టీలో క‌నీసం నాయ‌కులు కూడా లేరు. అలాంట‌ప్పుడు ఎవ‌ర్ని నిల‌బెడ‌తాడు.. ప్ర‌జ‌లు వాళ్ల‌ను ఎలా న‌మ్ముతారు..? ఇదే ఇప్పుడు అంద‌ర్లోనూ క‌నిపిస్తున్న ప్ర‌శ్న‌. మ‌రి చూడాలి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ స్టామినా ఎంతో..?

More Related Stories