English   

బాల‌య్య స్థానంపై క‌న్నేసిన చిరంజీవి.. 

chiru-balakrishna
2018-09-10 12:03:35

అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. చిరంజీవి సీరియ‌స్ గానే బాల‌య్య ప్లేస్ పై క‌న్నేసాడు. ఇప్పుడు ఈయ‌న సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు. కొన్నిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు మెగాస్టార్. సైరా షూటింగ్ మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ లోనే జ‌రిగింది. నాన్ స్టాప్ షెడ్యూల్ కావ‌డంతో కాస్త రిలీఫ్ అవుతున్నాడు చిరంజీవి. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు సిటీ దాటి బ‌య‌టికి కూడా వెళ్ల‌లేదు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ఇక్క‌డే అన్ని సెట్లు వేయించుకుని ప‌ని కానిస్తున్నాడు. అయితే ఇప్పుడు బ‌య‌టి దేశానికి వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. 

భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ల కోసం యూర‌ప్ దేశాల‌ను ఎంచుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు. తర్వాత షెడ్యూల్ ను అక్క‌డే ప్లాన్ చేస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి. దానికోస‌మే లొకేష‌న్ల వేట కూడా పూర్తి చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే బ్యాగ్ వేసుకుని సినిమాటోగ్ర‌ఫ‌ర్ ర‌త్న‌వేలుతో క‌లిసి ఆగ‌స్ట్ లోనే అన్నీ చుట్టొచ్చాడు ద‌ర్శ‌కుడు సూరి. ఇక ఇప్పుడు సెప్టెంబ‌ర్ మూడో వారంలో జార్జియాతో పాటు ర‌ష్యాలో కూడా భారీ యాక్ష‌న్ సీక్వెన్సులు ప్లాన్ చేసాడు సురేంద‌ర్ రెడ్డి. జార్జియా అంటే బాల‌య్య న‌టించిన శాత‌క‌ర్ణి గుర్తొస్తుంది. ఈ చిత్రంలోని చాలా యుద్ధ స‌న్నివేశాలు అక్క‌డే చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు క్రిష్. 

ఇప్పుడు చిరు కూడా బాల‌య్య వెళ్లిన చోటుకే వెళ్తున్నాడు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా నెల రోజుల పాటు అక్క‌డే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ఈ షెడ్యూల్ కోసం నిర్మాత చ‌ర‌ణ్ కూడా దాదాపు 30 కోట్ల వ‌ర‌కు కేటాయించిన‌ట్లు తెలుస్తుంది. మొన్న‌టి షెడ్యూల్ కూడా దాదాపు 40 కోట్ల‌తో చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు. యూర‌ప్ షెడ్యూల్ లో భారీగా జూనియర్ ఆర్టిస్ట్ లు ఉండ‌బోతున్నారు. దీనికోసం వీళ్ల‌కు హైద‌రాబాద్ లోనే ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కూడా ఇస్తున్నారు కూడా. చిరు కూడా ఈ శిక్ష‌ణ తీసుకోనుండ‌టం విశేషం. ఈయ‌న‌తో పాటే విజ‌య్ సేతుప‌తి కూడా ఇదే షెడ్యూల్ లో అడుగు పెడుతున్నాడు సినిమాలోకి. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రెగ్ పావెల్ నేతృత్వంలో యాక్ష‌న్ సీక్వెన్సులు తెర‌కెక్కించ‌గా.. ఇప్పుడు రాబోయే షెడ్యూల్ కోసం మ‌రో హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ లీ విట్టేకర్ ను తీసుకొచ్చారు. వ‌చ్చే ఏడాది సైరా విడుద‌ల కానుంది. 

More Related Stories