English   

రవితేజను నలిపేశారుగా

Amar-Akbar-Anthony
2018-09-10 08:11:08

హిట్టుంటేనే పట్టించుకునే పరిశ్రమ ఇది. ఒక్కసారి హిట్ ట్రాక్ తప్పారా.. ఇక ట్రాలీ పుల్లర్ కూడా లెక్క చేయడు. మరీ ఇలాంటి సిట్యుయేషన్ లో ఉన్నాడని చెప్పలేం కానీ.. ఇప్పుడు రవితేజ కూడా వరుస డిజాస్టర్స్ తో విపరీతంగా ఇబ్బందిపడుతున్నాడు. అందుకే ఒకప్పుడు మినిమం గ్యారెంటీ అనిపించుకున్న ఈ మాస్ రాజా ఇప్పుడో కొత్త  కుర్రాడికీ భయపడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా చెబితే ముందు కొత్త హీరో వెనక స్టార్ హీరో అన్నట్టుగా తయారైంది రవితేజ పరిస్థితి. దీనికి తోడు సినిమాపై కొన్నాళ్లుగా నెగెటివ్ కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీంతో నిర్మాతలు కూడా భయపడిపోయారు. ఏకంగా సినిమాను చాలా దూరం తీసుకువెళ్లారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఊహించగలరు కదా. యస్.. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. 

శ్రీను వైట్ల డైరెక్షన్ లో రూపొందుతోన్న అమర్ అక్బర్ ఆంటోనీలో రవితేజ మూడు భిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. ఇలియానా హీరోయిన్ గా నటిస్తూ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది.అ యితే ఈ సినిమాను ముందుగా అక్టోబర్ ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ లేటెస్ట్ గా అదే టైమ్ కు మేమూ వస్తున్నాం అంటూ విజయ్ దేవరకొండ మూవీ నోటా టీమ్ ప్రకటించింది. ఇప్పటికే విజయ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఏకంగా ఓవర్శీస్  కలెక్షన్స్ లో టాప్ ఫైవ్ లో చేరాడు. దీంతో అమర్ అక్బర్ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ కాస్త వెనకడుగు వేశారు. పోనీ నెక్ట్స్ వీక్ వద్దామంటే అక్కడ యంగ్ టైగర్ ఉన్నాడు. అక్టోబర్ 11న అరవింద సమేత వీరరాఘవ విడుదలవుతోంది. ఇక దసరాకు ఎలాగూ గట్టి తాకిడి ఉంటుంది. దీంతో ఎందుకొచ్చిన రిస్క్ లే అని ఏకంగా మూవీ టీమ్ డిసెంబర్ 3వ వారానికి వెళ్లిపోయింది. అయితే థర్డ్ వీక్ లో వస్తారా లేక ముందే వస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ..రవితేజ విషయంలో  ఇలా ఓ యంగ్ హీరోకు కూడా భయపడాల్సిన పరిస్థితి రావడం ఆశ్చర్యమే. 

మరో విషయం ఏంటంటే.. ఈ మధ్య రవితేజ కంటెంట్ కంటే కాసుల మేటర్ లోనే క్లియర్ గా ఉంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎప్పుడు వచ్చినా రవితేజకు పెద్దగా పట్టింపు లేదు. ఏదైనా తేడా వస్తే నిర్మాతలు లాస్ అవుతారు తప్ప తనకేం కాదు. ఇదే ఈ మధ్య కాలంలో బాగా గమనిస్తున్నారు. ప్రమోషన్స్ లో సహకరిస్తాడు కానీ.. రిజల్ట్ గురించి బెంగ లేదు. అందుకే నిర్మాతలు ఇలా తమ సేఫ్టీ తాము చూసుకుంటున్నారట. 

More Related Stories