English   

మహానటి భర్త కూడా మొదలుపెట్టాడా..?

Dulquer-Salmaan
2018-09-10 09:47:48

ఒక భాషలో స్టార్ హీరో మరో భాషలో స్మాల్ హీరో అవుతాడు. కానీ ఎప్పుడో లక్ వస్తుంది. ఒక సినిమా హిట్ అవుతుంది. అంతే.. ఇక ఆ తర్వాత అతను నటించిన సినిమాలన్నీ వరుసగా డబ్బింగ్ లు చేస్తుంటారు. ఇక్కడ విషాదం ఏంటంటే.. ఇలా వచ్చిన క్రేజ్ నుక్యాష్ చేసుకోవడానికి కొందరు అనువాద నిర్మాతలు అక్కడి వారి ఫ్లాప్ సినిమాలు చీప్ రేట్ కొని.. ఇక్కడ రుద్దేస్తుంటారు. దీనివల్ల కొన్నాళ్లకు వారి నుంచి నిజంగానే మించి సినిమాలు వచ్చినా ఎవరూ పట్టించుకోరు. ఇలా మన సినిమాలు తక్కువగా అవుతుంటాయి కానీ.. వేరే సౌత్ హీరోల సినిమాలు మాత్రం మన దగ్గర విపరీతంగా డబ్ అవుతుంటాయి. ఆ లిస్ట్ లోకి లేటెస్ట్ గా దుల్కర్ సాల్మన్ చేరాడు. 

గతంలో ఒకే బంగారం తమిళ్ సినిమా తెలుగులో డబ్ అయింది. అందులో నటించిన దుల్కర్ కు నాని డబ్బింగ్ చెప్పాడు. అతని నటన మనోళ్లకు బాగా నచ్చింది. బేసికల్ గానే టాలెంటెడ్ యాక్టర్ అయిన దుల్కర్ చేసిన మళయాల సినిమాలు ఒకట్రెండు సినిమాలు ఇక్కడ విడుదల చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇక మహానటి తర్వాత మొదలైంది. అతని మళయాలంలో లాస్ట్ మూవీ సోలో ను అదే పేరుతో డబ్ చేశారు. ఈ సినిమా అక్కడే డిజాస్టర్. ఇక్కడా సేమ్. అయితే దుల్కర్ ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం చేసిన ఉస్తాద్ హోటెల్ ను ఇప్పుడు బూజు దులిపి డబ్బింగ్ చేసిన మనోళ్ల మీదకు వదలబోతున్నారు.

 నిజానికి ఉస్తాద్ హోటెల్ అక్కడ సూపర్ హిట్. కానీ మన దగ్గరా విజయవంతం అయ్యే కంటెంట్ కాదిది. అయినా విడుదల చేస్తున్నారు. దీనివల్ల దుల్కర్ కువచ్చిన క్రేజ్ కూడా పోతుంది.  ఇక ఈ సినిమా టైటిల్ కూడా చిత్రంగా పెట్టారు.. ‘‘జనతా హోటెల్’’ అని. జనతా గ్యారేజ్ హిట్ కాబట్టి ఆ లుక్ దీనిపై పడుతుందనుకున్నారేమో. ఇక ఈ సినిమాలో నిత్య మీనన్ హీరోయిన్ కాబట్టి అది కూడా అదనంగా కలిసొస్తుందని అనువాద నిర్మాత ఆలోచన అయి ఉండొచ్చు. కానీ కంటెంట్ కదా ఇంపార్టెంట్. 

More Related Stories