English   

ఆ డైరెక్టర్ అన్నపూర్ణలో ‘బుక్’ అయ్యాడా..?

Ajay-Bhupathi
2018-09-10 17:20:44

ఎవరైనా ఓ డైరెక్టర్ హిట్ కొడితే ఆ డైరెక్టర్ పై ఇమ్మీడియెట్ గా కర్చీఫ్ వేయడంలో అన్నపూర్ణ బ్యానర్ తర్వాతే ఎవరైనా.. ఇలా చేసే కొందరు దర్శకులతో నెలల తరబడి వెయిట్ చేయించారు. దీంతో ఆ దర్శకుల్లో కొందరు ఏకంగా కెరీర్ కే ప్రమాదం తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. అలాగని బ్యానర్ బ్యాడ్ అని కాదు. బట్.. ఇక్కడ ఏదీ ఓ పట్టాన సెట్ కాదు. ఓ పట్టాన ఓకే అవదు. డబ్బులు పెట్టే నిర్మాత హడావిడీ నిర్ణయాలు తీసుకోకూడదు కదా అనొచ్చు. కానీ అలాగని దర్శకులను కూడా నమ్మాలి కదా.. అంటారు వాళ్లు. మొత్తంగా లేటెస్ట్ గా ఓ సూపర్ హిట్ తో ఎంటైర్ ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్న ఓ యంగ్ డైరెక్టర్ ను అన్నపూర్ణ బుక్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. 

నిజానికి అన్నపూర్ణ లాంటి పెద్ద బ్యానర్ లో సినిమా అవకాశం అంటే ఏ దర్శకుడికైనా హ్యాపీయొస్ట్ మేటరే. కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడా క్యాంప్ లోకి ఎంటర్ అయినా ఆ దర్శకుడి నుంచి నెక్ట్స్ సినిమా ఎప్పుడొస్తుందనేది ఎవరికీ తెలియదు కాబట్టి. గతంలో గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కొండా, స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మల టైమ్ ఇలాగే వేస్ట్ అయింది. తర్వాత వాళ్లు చేసిన సినిమాలూ పోయాయ్. వీరిలో సుధీర్ వర్మ ఎలాగో బౌన్స్ బ్యాక్ అయ్యాడు కానీ విజయ్ కొండా ఇంత వరకూ అడ్రెస్ లేడు.

ఇక ఇప్పుడు ఆర్ఎక్స్ 100తో అదిరిపోయే హిట్ కొట్టిన దర్శకుడు భూపతి వర్మకు కూడా అన్నపూర్ణ క్యాంప్ గేలం వేసిందనే టాక్ వినిపిస్తోంది. లేటెస్ట్ గా అతను నాగార్జునను కలిసి వచ్చాడు. సినిమా బావుంటే ఓపెన్ గా అప్రిసియేట్ చేయొచ్చు. కానీ ఇలా ఇంటికి పిలిచి అభినందించరు. అలా చేయాలన్నా సినిమా వచ్చినప్పుడే చేస్తారు. కానీ ఇన్ని రోజుల తర్వాత కాదు. మొత్తంగా భూపతి వర్మ కు కోలీవుడ్ ధనుష్ నుంచి కూడా కాల్ వచ్చింది. అలాంటిది రూమర్స్ నిజమై అన్నపూర్ణలో కమిట్ అయ్యాడా.. నిజంగానే అతను బుక్ అయిపోయినట్టు. ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న ముగ్గురు హీరోలు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. వారిలో ఎవరూ భూపతితో ఇప్పుడప్పుడే సినిమా చేసే పరిస్థితి లేదు.

More Related Stories