English   

సుధీర్ బాబు ట్రైలర్ బావుందే...

Sudheer-babu
2018-09-10 18:20:43

సుధీర్ బాబు.. కృష్ణగారి అల్లుడుగా, మహేష్ బాబు బావగా వచ్చినా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకునేందుకే ప్రయత్నించాడు. లేటు వయసులో హీరో అయిన సుధీర్ అది కనిపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. మరోవైపు బాలీవుడ్ లో నూ విలన్ గా ట్రై చేశాడు. మొత్తంగా రీసెంట్ గా సమ్మోహనంతో సూపర్ హిట్ అందుకుని ట్రాక్ లో పడ్డాడు. కానీ సడెన్ గా నిర్మాతగా మారాడు. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ అంటూ కొత్త నిర్మాణ సంస్థను నెలకొల్పిఈ బ్యానర్ లో మొదటి సినిమాగా ‘‘నన్ను దోచుకుందువటే’’ తీశాడు. ఆర్ ఎస్ నాయుడు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ నెల 13న విడుదల చేస్తామని చెప్పినా.. ఆ రోజు కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో 21కి వెళ్లాడు. మొత్తంగా ఆ మధ్య విడుదల చేసిన టీజర్ తో పాటు బిగ్ బాస్ ఆంథెమ్ సాంగ్ తో ఆకట్టుకున్న సుధీర్ బాబు.. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశాడు.

నన్ను దోచుకుందువటే టీజర్ చూసినప్పుడు ఏదో మిస్ అయిందే అనిపించింది. అది ఈ ట్రైలర్ తో ఫిల్ చేశాడు దర్శకుడు. ట్రైలర్ చూస్తే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో.. అంత కాన్ ఫ్లిక్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. యాక్టింగ్ పిచ్చి ఉన్న సాఫ్ట్ వేర్ అమ్మాయిగా హీరోయిన్ తో మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకున్నట్టున్నాడు దర్శకుడు. ఇక ఈ కథలో సుధీర్ బాబు కూడా ఒదిగిపోయాడు. కానీ సడెన్ గా ఈ కథ మారింది. హీరోయిన్ కోసం తెగ తిరిగిన కార్తీక్(సుధీర్ బాబు) సడెన్ గా ఆమెను ప్రేమించడం లేదు ఇడియట్ అంటాడు. అక్కడి నుంచి ట్రైలరే సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ‘అమ్మాయిలకు అమెరికా అంటే ఇష్టముండొచ్చు కానీ.. అమెరికా వెళ్లే ప్రతోడి మీద కాదు’ అని చెప్పిన డైలాగ్ బావుంది. అలాగే హీరోయిన్ తన షార్ట్ ఫిలిమ్ టైటిల్ చెబుతూ పిచ్చి చివర్లో వస్తుందని చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది. మొత్తంగా నన్ను దోచుకుందువటే ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది..  సుధీర్ మరో హిట్ కొట్టేలానే ఉన్నాడు. 

More Related Stories