English   

మెగాస్టార్ కే షాకిచ్చిన విజయ్ దేవరకొండ

Chiranjeevi-Vijay-Devarakonda
2018-09-10 19:48:58

తెలుగులో కొత్తగా వచ్చిన ప్రతి హీరో కల.. మాస్ హీరో అనిపించుకోవడం.. అందుకోసం చాలామంది హీరోలు ట్రై చేసి బొక్క బోర్లా పడ్డారు కూడా. ఆ ఇమేజ్ రావాలంటే కంటెంట్ మాత్రమే కాదు.. కటౌట్ లో కూడా దమ్ముండాలి మరి. ఆ మేటర్ పక్కన బెడితే మన దగ్గర మాస్ హీరో అయిన ప్రతి స్టార్ ఫస్ట్ చేసింది నైజాం మార్కెట్ ను కొల్లగొట్టడం. ఇప్పటికీ చాలామంది మాస్ హీరోలకు కూడా నైజాంలో పెద్దగా దమ్ము లేదు. బట్ మెగా ఫ్యామిలీ మాత్రం నైజాంలో ముందు నుంచీ బాస్ లా ఉంటోంది.

ముఖ్యంగా బాస్ మెగాస్టార్ చిరంజీవికి ఉన్నంత మార్కెట్ నైజాంలో ఇంకెవరికీ లేదు. ఆయన్నుంచి యావరేజ్ సినిమా వచ్చినా ఇక్కడ అదిరిపోయే క్రేజ్ ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నైజాం పై పట్టు సాధించాడు. దీంతో మెగా హీరోలను బీట్ చేయాలి నైజాంలో అనుకుని చాలాకాలంగా చాలామంది హీరోలు ట్రై చేస్తున్నారు. కానీ ఏదో ఒకటీ రెండు సినిమాలకు తప్ప కాన్ స్టెంట్ గా అది ఎవరికీ సాధ్యం కావడం లేదు. కానీ చూస్తోంటే విజయ్ దేవరకొండ మెగా జోన్ లో పాగా వేసేలానే ఉన్నాడు. 

మూడు బ్లాక్ బస్టర్స్ తోనే నయా స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ ఏకంగా నైజాం లో 20కోట్ల షేర్ మార్క్ కు దగ్గరలో ఉన్నాడు. ఇప్పటి వరకూ ఇక్కడ హైయ్యొస్ట్ గా ఉంది మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150. 20కోట్లకు పైన షేర్ తో మెగాస్టార్ తన రేంజ్ ను నిలుపుకున్నాడు. కానీ ఇప్పుడు విజయ్ ఆ మార్క్ కు అతి దగ్గరగా వచ్చి ఏకంగా మెగా ఫ్యామిలీకే షాక్ ఇవ్వబోతున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ జోష్ చూస్తే ఇదేమీ గాలివాటంగా వచ్చినట్టు కనిపించడం లేదు. మనోడు స్టోరీ సెలెక్షన్స్ లో కూడా బలంగా ఉన్నాడు. పైగా నైజాం వాడు. కాబట్టి ఫ్యూచర్ లో విజయ్ కి ఇక్కడ మార్కెట్ స్థిరంగా మారడం ఖాయం అంటోంది ట్రేడ్. అదే నిజమైతే.. ఇక ఇప్పటి వరకూ మెగా జోన్ గా ఉన్న నైజాంలో నయా నవాబ్ వచ్చినట్టే..

More Related Stories