English   

ఛార్మీ పై శ్రీ రెడ్డి కొత్త బాంబ్

Actress Sri Reddy Latest Controversy Comments on Charmy Kaur
2018-09-10 21:34:05

శ్రీ రెడ్డి మళ్లీ లీకులు మొదలు పెట్టింది. అయితే ఈ సారి ఎవ్వరూ ఊహించని విధంగా పోస్ట్ పెట్టింది. నిజానికి ఇది చూస్తే చాలామంది నమ్మరు. కాకపోతే నమ్మడానికి ఆస్కారమూ లేకపోలేదు అనుకునేవాళ్లూ ఉంటానరుకోండి. ఇప్పటి వరకూ శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎప్పుడూ ఛార్మీ గురించి మాట్లాడింది లేదు. కానీ లేటెస్ట్ గా తన ఫేస్ బుక్ పేజ్ లో ఏకంగా ఛార్మీకి, సచిన్ టెంటూల్కర్ కు లింక్ పెడుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఏంటీ షాక్ అయ్యారా.. యస్ ఇది నిజం.. శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్ ను యధాతథంగా చూస్తే .. ‘‘ సచిన్ టెండూల్కరన్ అనబడే ఓ రొమాంటిక్ పర్సన్... ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఓ ఛార్మింగ్ గాళ్ తో రొమాన్స్ చేస్తాడు.. దీనికి చాముండేశ్వర్ స్వామి అనే హై ప్రొఫైల్ పర్సెన్ మీడియేటర్.. గొప్ప వాళ్లు ఏదైనా బాగా ఆడతారు కదా.. అదే రొమాన్స్ లో..???’’ అంటూ తను పెట్టిన పోస్ట్ నిజానిజాల పరిస్థితి ఎలా ఉన్నా వైరల్ అవుతోంది.

ఈ మధ్య మారు మనసు పొందని మనిషిలా పోస్ట్ లు పెడుతోంది శ్రీ రెడ్డి. దీంతో తనకు వచ్చే కామెంట్స్ కూడా పెద్దగా కిక్ ఇవ్వడం లేదు. అందుకే ఇలాంటి బాంబ్ వేసింది. అయితే ఛార్మీని ఇలా అంటే తను ఊరుకుంటుంది అనుకోలేం. ఎందుకంటే తనిప్పుడు పూరీ జగన్నాథ్ కోటరీ మనిషి మరి. ఏదేమైనా సచిన్ టెండూల్కర్, ఛార్మీ అంటూ శ్రీ రెడ్డి వేసిన ఈ బాంబ్ లో చాముండేశ్వరి నాథ్ కూడా ఉన్నాడు. కానీ వీళ్లెవరి పేర్లూ తను డైరెక్ట్ గా చెప్పకపోయినా ఎవరికైనా అర్థమవుతాయి కదా.. మరి ఈ కొత్త వ్యవహారం ఎటు తేలుతుందో చూడాలి.

More Related Stories