English   

డైరెక్టర్ క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు

Kangana Ranaut's Manikarnika Movie Lands in Trouble Again
2018-09-11 07:01:50

కంగనా రనౌత్.. బాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్శీయల్ క్వీన్. అయితే ఇప్పటి వరకూ తన కామెంట్స్ అన్నీ పర్సనల్. మరోవైపు తను చేస్తోన్న సినిమలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో తనలో ఓవర్ కాన్పిడెన్స్ ను కూడా దాటిన అహంకారం మొదలైంది. ఇదే మణికర్ణిక నుంచి దర్శకుడు క్రిష్ బయటకు రావడానికి కారణమైంది. తను న్యూయార్క్ లో ఓ ఫిల్మ్ కోర్స్ చేసింది. ఆ పాండిత్యాన్నంతా ఇప్పుడు చేస్తోన్న ‘మణికర్ణిక’పై రుద్దే ప్రయత్నం చేసింది. అసలే స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక ఎవరైనా వేలు పెడితే ఊరుకోని క్రిష్ బాలీవుడ్ కదాని కొంతకాలం సహించాడు. కానీ కంగన యాక్షన్ మరీ ఓవర్ అవుతుండటంతో ఏకంగా ఆ ప్రాజెక్ట్ నుంచే తప్పుకున్నాడు. అయినా లెక్క చేయలేదు కంగనా.. తనే డైరెక్టర్ గా మారింది.

మరోవైపు కంగన డైరెక్షన్ మాత్రమే కాదు.. ప్రవర్తన కూడా నచ్చకపోవడంతో ఆ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సోనూసూద్ కూడా ఓ మహిళ దర్శకత్వంలో పనిచేయలేను అంటూ ఆ మధ్య తప్పుకున్నాడు. అయితే ఇలాంటివేవీ లెక్క చేయని కంగనా ఏకంగా ఓ పిచ్చి పనికి పూనుకుంది.

ఇప్పటి వరకూ క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కించిన సన్నివేశాలను కూడా రీ షూట్ చేయాలని ప్రయత్నం మొదలుపెట్టింది. కొన్ని సీన్స్ చేసింది కూడా. అయితే వ్యవహారం మరీ శ్రుతి మించి పోతుండటంతో ఇన్నాళ్లూ కామ్ గా ఉన్న నిర్మాత ఫైర్ అయ్యాడు. ఆ ప్రాజెక్ట్ నుంచి కంగనాను తప్పించలేక ఏకంగా తనే తప్పుకున్నాడు. ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చు చాలు అంటూ అమ్మడికి ఓ దండం పడేసి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.

నిజానికి ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ 70కోట్లు. కానీ కంగన ఎంటర్ అయ్యాక ఆ బడ్జెట్ మరో 30కోట్లు పెరిగింది. అంటే 100కోట్ల బడ్జెట్ అన్నమాట. తను చేసిన రెండు మూడు సినిమాలు వంద కోట్లు సాధించాయి కాబట్టి తన మార్కెట్ కూడా అదే అనుకుంటుదేమో.. అసలే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఏ మాత్రం తేడా కొట్టినా పాతిక కోట్లు కూడా రావు. అప్పుడు నిండా మునిగేది నిర్మాతలే కదా. అదేదో ముందే ఊహించలేకపోయినా.. లేట్ గా అయినా ఆ నిర్మాత తప్పుకున్నాడు. మరి ఇప్పుడు కంగనా తన సొంత డబ్బులతో ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తుందా అనేది తెలియాలి. ఒకవేళ అలా చేసినా తన శతృవు(తను ఫీలైనట్టుగా) హృతిక్ రోషన్ తో పాటు తన సినిమాను జనవరి 25న విడుదల చేయాలనుకున్న తన ఆశ నెరవేరదు. ఏదేమైనా పిచ్చికి కూడా హద్దుంటుంది. అది దాటితే పర్యవసానం ఇలాగే ఉంటుంది. మరి ఇప్పుడు కంగనా ఏం చేస్తుందో చూడాలి.

More Related Stories