English   

భార్యాభ‌ర్త‌ల్లో గెలుపు ఎవ‌రిది..? 

Shailaja-Reddy-Alludu
2018-09-11 10:23:43

ఓ కుటుంబం నుంచి ఇద్ద‌రు హీరోలు పోటీ ప‌డితేనే ఆస‌క్తి  మామూలుగా ఉండ‌దు. ఎవ‌రు గెలుస్తార‌బ్బా అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా చూస్తుంటారు. ఇక అలాంటిది ఇప్పుడు ఏకంగా భార్యాభ‌ర్త‌లే పోటీకి దిగుతుంటే ఇంక ఆ ర‌చ్చ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఏ ఇద్ద‌రిని క‌దిపినా అక్కినేని పోరు గురించే మాట్లాడుకుంటున్నారు. భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ వ‌చ్చి సెప్టెంబ‌ర్ 13న త‌మ సినిమాల‌తో పోటీకి సై అంటే సై అంటున్నారు. శైల‌జారెడ్డి అల్లుడుతో పాటు స‌మంత యు ట‌ర్న్ కూడా ఇప్పుడు వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానున్నాయి. కెరీర్ లో తొలి సారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది స‌మంత‌. దానికి ఇప్పుడు చైతూ వ‌చ్చి అడ్డు ప‌డ్డాడు. ఇద్ద‌రూ డిఫెరెంట్ సినిమాలు.. రెండు భిన్న‌మైన కాన్సెప్టులు చేసారు.. పైగా వినాయ‌క‌చ‌వితి ఉంది కాబ‌ట్టి స‌మ‌స్య ఉండ‌ద‌నే భావిస్తున్నారు డిస్ట్రిబ్యూట‌ర్లు. 

అయితే బ‌య‌ట ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు భార్యాభ‌ర్త‌ల పోరుపై పందేలా కాచుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సంక్రాంతి పందేలను చూసాం కానీ ఇప్పుడు వినాయక చ‌వితి పందెం మొద‌లైంది. ఇప్ప‌టికే చైతూ, స‌మంత సినిమాల‌కు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ఇలాంటి టైమ్ తో అస‌లు ఈ పోరులో ఎవ‌రు గెలుస్తారు అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రోవైపు అక్కినేని జంట మాత్రం ఒక‌రి సినిమాల‌ను ఒక‌రు ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. త‌న సినిమాను భార్య‌.. స్యామ్ సినిమాను తాను ప్ర‌మోట్ చేస్తామ‌ని చెప్పాడు ఈ హీరో. త‌న సినిమాతో పాటు భార్య సినిమాను కూడా చూడాలంటూ అత్త మామ‌ల‌తో పాటు బామ్మ‌ర్దుల‌కు కూడా చెప్తానంటున్నాడు చైతూ. మొత్తానికి చూడాలిక‌.. ఈ వార్ లో ఈ వారం గెలుపు ఎవ‌రిదో..? 

More Related Stories