English   

దేవదాస్ కు భలే విలన్ దొరికాడుగా

Kunal-Kapoor-devadas
2018-09-11 12:58:26

అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార నాని హీరోలుగా రూపొందుతోన్న సినిమా ‘దేవదాస్’. నాగ్ దేవాగా నాని దాస్ గా నటిస్తోన్న సినిమా ఇది. అందుకే ఈ టైటిల్ పెట్టారు. నాగ్ డాన్ పాత్రలో కనిపిస్తే.. నాని డాక్టర్ గా నటిస్తున్నాడు. ఓ ఫారిన్ మూవీకి ఇది అనఫీషియల్ రీమేక్ అని చెబుతోన్నా దర్శకుడు అదేం కాదంటున్నాడు. ఇక నాగార్జున సరసన మళ్లీరావా ఫేమ్ ఆకాంక్షం సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా నాని సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. మొత్తంగా క్రేజీ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న ఈ మూవీ విలన్ దొరికాడు. బాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న అతనికి ఇదే తొలి తెలుగు సినిమా. రంగ్ దే బసంతితో మనవారికీ పరిచయం ఉన్న ఆ నటుడు కునాల్ కపూర్. లాస్ట్ ఇయర్ మాలీవుడ్ లో ఓ సినిమాలో హీరోగా నటించిన కునాల్ కు తెలుగులో చేయాలని ఎప్పటి నుంచో ఉందట. అది ఇన్నాళ్లకు నెరవేరింది. అందుకే విలన్ అయినా వెంటనే ఒప్పుకున్నాడు అంటున్నారు. ఇక తెలుగులో భలేమంచి రోజు, శమంతకమణితో తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీ ఏర్పాటు చేసుకున్న శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తోన్న దేవదాస్ ను అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ నెలలోనే విడుదల కాబోతోన్న ఈ మూవీపై ఇప్పటి వరకూ మంచి బజ్ తీసుకురావడంలో టీమ్ పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. అసలే మల్టీస్టారర్ కాబట్టి ఇద్దరు హీరోలూ పెద్దగా పట్టించుకునే ఛాన్స్ లేదు. కానీ నాగార్జున కొన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నాడట. కానీ నాని మాత్రం తన పని వరకే పరిమితమై పోయాడు. మొత్తంగా ఈ మూవీతో తెలుగులో విలన్ గా డెబ్యూ ఇస్తోన్న కునాల్ కపూర్ కు మంచి టాలెంటెడ్ యాక్టర్ గా పేరుంది. మరి తన టాలెంట్ ను దేవదాస్ లో ఎలా చూపించబోతున్నాడో చూడాలి.

More Related Stories