English   

నాగ‌చైత‌న్య త‌డాఖా చూపిస్తాడా.. ?

Sailaja-Reddy-Alludu
2018-09-11 13:05:45

శైల‌జారెడ్డి అల్లుడుపై ఇప్పుడు ఇండియాలోనే కాదు.. ఓవ‌ర్సీస్ లో కూడా భారీ అంచ‌నాలున్నాయి. అస‌లు చైతూ సినిమాల‌కు ఇంత‌గా ప్ర‌మోష‌న్ ఎప్పుడూ చేయ‌లేదు.. అక్క‌డ ఇంత ట్రెండింగ్ కూడా ఎప్పుడూ కాలేదు. కానీ ఇప్పుడు అల్లుడు అన్నీ చేస్తున్నాడు. మారుతి బ్రాండ్ కు తోడు చైతూ ఇమేజ్ కూడా ఈ చిత్రానికి బాగానే ప్ల‌స్ అవుతుంది. అన్నింటికీ మించి ర‌మ్య‌కృష్ణ అత్త‌గా న‌టించ‌డంతో సినిమా ఎలా ఉండ‌బోతుందా అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. మారుతి ఎలాగూ కామెడీని బాగా హ్యాండిల్ చేస్తాడు.. పైగా అత్తా అల్లుళ్ల కాన్సెప్ట్ అంటేనే అదుర్స్ అనే సెంటిమెంట్ ఉంది తెలుగు ఇండ‌స్ట్రీలో. ఇవ‌న్నీ ఈ సినిమాకు క‌లిసొస్తున్నాయి. ఇదే ఇప్పుడు సినిమాపై ఓవ‌ర్సీస్ లోనూ అంచ‌నాలు పెంచేసింది. ఈ సినిమాను అక్క‌డ 3 కోట్ల‌కు పైగానే పెట్టి తీసుకున్నారు. 

ఇంత మొత్తం రావాలంటే 1 మిలియ‌న్ క‌చ్చితంగా దాటాల్సిందే. ఇప్ప‌టి వ‌ర‌కు చైతూకు సోలోగా ఓవ‌ర్సీస్ లో 1 మిలియ‌న్ సినిమా లేదు. మ‌నం సినిమా 1.4 మిలియ‌న్ తీసుకొచ్చినా అందులో నాగార్జున కూడా ఉన్నాడు. ఇక ప్రేమ‌మ్ 8 ల‌క్ష‌ల డాల‌ర్లు.. రారండోయ్ వేడుక చూద్దాం 5 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసాయి. దాంతో ఇప్పుడు అల్లుడు ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుందో అనే అంచ‌నాలు ఉన్నాయి. సెప్టెంబ‌ర్ 13న ఈ సినిమా విడుద‌ల కానుంది. అమెరికాలో అయితే నాగ‌చైత‌న్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కానుంది ఈ చిత్రం. అక్క‌డ ఏకంగా 173 లొకేష‌న్స్ కు పైగానే విడుద‌ల‌కు సిద్ధ‌మైంది అల్లుడు. మారుతి సినిమాల‌కు అక్క‌డ క్రేజ్ బాగానే ఉంటుంది. ఇదే అల్లుడుకు బాగా క‌లిసొచ్చే అంశం. సెప్టెంబ‌ర్ 12 రాత్రే భారీగా ప్రీమియ‌ర్స్ కూడా ప‌డుతున్నాయి. తాజాగా థియేట‌ర్స్ లిస్ట్ కూడా బ‌య‌టికి వ‌చ్చాయి. మ‌రి అక్క‌డ అల్లుడు కుమ్ముడు ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories