English   

అధ‌రామృతానికి అల‌వాటు ప‌డ్డ‌ విజ‌య్.. 

Vijay-Devarakonda
2018-09-11 15:21:10

స్టేట్మెంట్ కాస్త కాంట్ర‌వ‌ర్సీగానే ఉన్నా.. ఇప్పుడు ఇదే నిజం. ఈయ‌న నిజంగానే ఇప్పుడు పెద‌వుల‌కు బాగా రుచి మ‌రిగిపోయాడు. తెలుగులో లిప్ లాక్ అంటే కాస్త పెద్ద విష‌య‌మే. కానీ ఇప్పుడు చాలా మంది ద‌ర్శ‌కులు హీరోలు దాన్ని చాలా చిన్న విష‌యంగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా విజ‌య్ దేవ‌ర‌కొండ అయితే లిప్ లాక్ అనేది న‌ట‌న‌లో భాగ‌మే అని ఫిక్సైపోయాడు. త‌న ప్ర‌తీ సినిమాలో లిప్ లాక్ ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు ఈ హీరో. కావాల‌ని చేస్తున్నారో.. లేదంటే క‌థ‌కు అలా కుదిరిపోతున్నాయో తెలియ‌దు కానీ ద‌ర్శ‌కులు కూడా విజ‌య్ కోసం ముద్దుల వ‌ర్షం కురిపించే సీన్స్ రాసుకుంటున్నారు. అది ఆయ‌న‌కు సెంటిమెంట్ కూడా అయిపోయింది. అర్జున్ రెడ్డి.. గీత‌గోవిందం.. మ‌ధ్య‌లో విడుదలై ఫ్లాప్ అయిన ద్వారకా సినిమాల్లో కూడా లిప్ లాక్స్ ఉన్నాయి. 

ఇక ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైన నోటాలో కూడా ముద్దు సీన్లు ఉన్నాయి. ట్రైల‌ర్ లో ఒక‌టి మాత్ర‌మే చూపించారు కానీ సినిమాలో మాత్రం బాగానే ఉన్నాయ‌ని తెలుస్తుంది. ఇందులో జ‌ల్సాపురుష్ గా న‌టిస్తున్నాడు విజ‌య్. ముందు ఏ బాధ్య‌త లేకుండా ఉండి.. ఆ త‌ర్వాత ఓ స్టేట్ కు సిఎం అయ్యే పాత్ర‌లో న‌టిస్తున్నాడు విజ‌య్. దీనిపై కూడా అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మెహ్రీన్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ భామ‌తో కూడా ముద్దు సీన్స్ చేస్తున్నాడు విజ‌య్. అక్టోబ‌ర్ 4న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఒకేసారి తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కానుంది నోటా. ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. మ‌రి ఈ ముద్దుల ప్రియుడి దూకుడు ఎప్ప‌టికి త‌గ్గుతుందో చూడాలిక‌. 

More Related Stories