English   

సమంతకు షాక్ ఇస్తోన్న దుబాయ్ రిపోర్ట్స్ ..

U-Turn-pre-release
2018-09-11 17:56:09

సమంత.. వరుస సినిమాలతో పెళ్లి తర్వాత కూడా దుమ్మురేపుతోన్న బ్యూటీ. ఇప్పటికే ఈ యేడాది హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ భామ లేటెస్ట్ మూవీ ‘యూ టర్న్’. తెలుగుతో పాటు తమిళ్ లోనే ఈ నెల 13న విడుదల కాబోతోందీ సినిమా. అదే రోజు తను తమిళ్ లో నటించిన సీమరాజా కూడా విడుదల కాబోతోంది. అయితే లేటెస్ట్ గా సమంతకు దుబాయ్ నుంచి కొన్ని షాకింగ్ న్యూస్ తెలుస్తున్నాయట. దీంతో అమ్మడు ఆందోళనలో పడిపోయినట్టు టాక్. మరి తనను ఆందోళనలో పడేసిన న్యూస్ ఏంటో తెలుసా..?

కన్నడలో సూపర్ హిట్ అయిన యూ టర్న్ ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసింది సమంత. ఈ సినిమాను తనే నిర్మాత అన్నారు చాలామంది. కానీ కాదు అని ఖచ్చితంగా చెబుతూ వస్తోంది. కానీ సినిమాకు సంబంధించి ప్రతి అంశంలోనూ తనే ముందుంటోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ టాక్ బయటకు వచ్చింది. అది కూడా దుబాయ్ నుంచి. మామూలుగా దుబాయ్ నుంచి ఓ టాక్ వచ్చిదంటే అది జెన్యూన్ అని అందరికీ తెలుసు. గతంలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సూపర్ హిట్ అని అందరూ అంటున్నా.. దుబాయ్ ప్రీ రిలీజ్ టాక్ ద్వారానే సినిమా ఫ్లాప్ అని అందరికీ ముందు తెలిసింది. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి యూ టర్న్ సినిమాకు సంబంధించి కొన్ని బైట్స్ వచ్చాయి. అవి సినిమా చూసిన వారివి. జస్ట్ యావరేజ్ సినిమా అనీ.. సమంత చేసిన ప్రయత్నం ఏమంత ఆకట్టుకోలేదని ఉన్నాయట ఆ బైట్స్. దీంతో హడావిడీగా రంగంలోకి దిగిన యూ టర్న్ టీమ్.. వాటిని ఇతర మీడియా సంస్థలు పబ్లిష్ చేయకుండా ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 

నిజానికి ఈ సినిమా కన్నడలో వర్కవుట్ అయినట్టుగా తెలుగులో అవడం కష్టం అని ముందు నుంచీ కొందరు చెబుతూనే ఉన్నారు. అయినా తనకు బాగా నచ్చిందనే కారణంతో సమంతనే కావాలని ఈ చిత్రాన్ని రీమేక్ చేయించింది. మరి తన ప్రయత్నానికి ఇప్పుడు షాకింగ్ రిజల్ట్ వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇవి నిజంగా నిజమేనా.. లేక ఎవరైనా కావాలని క్రియేట్ చేస్తున్నారా అనేది తెలియాలి. ఏమో.. ఒక్కోసారి ప్రీ రిలీజ్ టాక్స్ అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలూ ఉన్నాయి కదా. అలా జరిగితే సమంత యూ టర్న్ కు వచ్చిన ఇబ్బందులేమీ ఉండవు.

More Related Stories